Home న్యూస్ కోబ్రా మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

కోబ్రా మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉన్నప్పటికీ అపరిచితుడు తరువాత మళ్ళీ అలాంటి హిట్ ని అందుకోలేక పోతున్న విక్రమ్ రీసెంట్ మూవీస్ లో మంచి హైప్ ను సొంతం చేసుకున్న సినిమా కోబ్రా… డిఫెరెంట్ గెటప్స్ తో విక్రమ్ కనిపించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అవ్వగా తెలుగు లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే…

పలు దేశాలతో పాటు ఇండియాలో కొన్ని హత్యలు జరుగుతాయి, వీటి వెనక ఓ ఫేమస్ లెక్కల మాస్టార్ ఉన్నారని తెలుస్తుంది, అసలు ఈ హత్యలకు హీరోకి లింక్ ఏంటి, దాని వెనక ఉన్న మిస్టరీ ఏంటి, తర్వాత ఏం జరిగింది అన్నది మొత్తం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఓవరాల్ గా స్టొరీ కాన్సెప్ట్ డిఫెరెంట్ గానే ఉన్నప్పటికీ కూడా….చెప్పిన విధానం మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు…

3 గంటలకు పైగా లెంత్ ఉన్న ఈ సినిమా ఫస్టాఫ్ లో మర్డర్స్ అండ్ లవ్ స్టొరీ సీన్స్ తో చాలా వరకు బోర్ కొట్టించినా ప్రీ ఇంటర్వెల్ నుండి ఆకట్టుకుని ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తుంది, ఇక సెకెండ్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ కానీ హీరో హాల్యుజినేషన్ సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి…పలు గెటప్స్ లో విక్రమ్ తనదైన నటనతో మెప్పించాడు, సినిమా మొత్తం విక్రమే కనిపిస్తాడు…

కీలక రోల్ లో ఇర్ఫాన్ పటాన్ పర్వాలేదు అనిపించగా హీరోయిన్స్ 3 ఉండగా వాళ్ళలో శ్రీనిది శెట్టి డామినేట్ చేసింది. సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండగా ఆ బడ్జెట్ కి తగ్గట్లు సినిమాటోగ్రఫీ చాలా బాగా మెప్పించింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే….అంజలి CBI లాంటి థ్రిల్లర్ తో ఓ రేంజ్ లో మెప్పించిన డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు….

ఎంచుకున్న కోర్ కథ పాయింట్ బాగున్నా కానీ చెప్పిన విధానం చాలా నెమ్మదిగా, అవసరం లేని డ్రామాతో, లాజిక్ లేని సీన్స్ తో పాటు భారీ లెంత్ తో చెప్పడంతో చూస్తున్న ఆడియన్స్ కి ఓ రెండు సినిమాలు చూసిన లెంత్ ఫీలింగ్ వస్తుంది. దాంతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్న సినిమా కొన్ని సీన్స్ మినహా ఎక్కడా ఆకట్టుకోలేక పోయింది, మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here