Home న్యూస్ కమల్ హాసన్ ఎపిక్ హిట్ విక్రమ్ కి 2 ఏళ్ళు….బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

కమల్ హాసన్ ఎపిక్ హిట్ విక్రమ్ కి 2 ఏళ్ళు….బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఏళ్లకి ఏళ్ళు ఎదురు చూసిన వాళ్ళలో లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) కూడా ఒకరు…ఒక దశలో కంబ్యాక్ కోసం తన కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటైన భారతీయుడు(Bhaarateeyudu) మూవీ సీక్వెల్ ను మొదలు పెట్టినా కమల్ మీద ఓవర్ బడ్జెట్ అయిపోతుందని ఆ సినిమానే ఆపేశారు….

అలాంటి టైంలో కమల్ హాసనే స్వయంగా నిర్మాతగా మారి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేసిన విక్రమ్(Vikram Hitlist) మూవీ రెండేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చింది….కమల్ హాసన్, హఫాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ కాస్ట్ సూర్య లాంటి క్రేజీ యాక్టర్ స్పెషల్ రోల్ లో నటించడంతో సినిమా మీద హైప్ ఓ లెవల్ లో పెరిగిపోగా…

ఖైదీ మూవీకి లింక్ చేయడం LCU యూనివర్స్ స్టార్ట్ అవ్వడంతో సౌత్ మొత్తం మీద సినిమా పై క్రేజ్ ఓ లెవల్ లో పెరిగిపోయింది. ఆ అంచలాను సినిమా పూర్తిగా అందుకోకపోయినా కూడా అనిరుద్ మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్, కమల్ హాసన్ మాస్ అవతార్, సినిమాలో హైలెట్ గా నిలిచిన సూర్య క్లైమాక్స్ ఎపిసోడ్ అన్నీ కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచింది…

తెలుగులో 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా కమల్ హాసన్ ఫామ్ లో లేకపోయినా కూడా ఊహకందని వసూళ్ళని సాధించి 17.8 కోట్ల షేర్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ మీద 10.3 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Vikram Total World Wide Collections Approx
👉Tamilnadu – 182.50Cr
👉Telugu States- 31.40Cr
👉Karnataka- 22.10Cr
👉Kerala – 40.60Cr
👉ROI – 14.50Cr
👉Overseas – 126.00CR
Total WW collection – 417.10CR(210CR~ Share)

సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 100 కోట్ల దాకా ఉండగా టోటల్ రన్ లో ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 110 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని కమల్ హాసన్ కి ఎపిక్ కంబ్యాక్ గా నిలిచింది. ఆ రేంజ్ హిట్ ఇచ్చిన విక్రమ్ వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా తిరిగి కమల్ హాసన్ మూవీస్ అంటే క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళేలా చేసింది ఈ సినిమా సక్సెస్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here