ప్రస్తుతం థియేటర్స్ రీ ఓపెన్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నా కానీ ఆల్ రెడీ కొన్ని సినిమాలకు ఓటిటి లలో డైరెక్ట్ రిలీజ్ కి డీల్స్ సెట్ అవ్వడం వలన వాటిని ఇక తప్పక డిజిటల్ లోనే రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చియాన్ విక్రమ్ మరియు విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ మహాన్…..
ఆడియన్స్ ముందుకు ఈ నెల 10 న డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. రీసెంట్ టైం లో విక్రమ్ నటించిన ఏ సినిమా కూడా ఆడియన్స్ ను….
మెప్పించకలేక పోయింది. గట్టిగా చెప్పాలి అంటే విక్రమ్ కెరీర్ లో అపరిచితుడు తర్వాత మళ్ళీ ఓ బ్లాక్ బస్టర్ అయితే పడలేదు అనే చెప్పాలి. ఐ సినిమా లాస్ట్ టైం భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది కానీ హిట్ గీత దాటలేదు… కానీ విక్రమ్ నటించిన సినిమాలు….
ఎప్పటికప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందుతూ వస్తూ ఉండటం, ఆ అంచనాలను అందుకోక పోవడం జరుగుతూ ఉన్నా కానీ డిజిటల్ అండ్ శాటిలైట్ మరియు డబ్బింగ్ రైట్స్ బిజినెస్ లు బాగానే జరుగుతూ ఉండటంతో విక్రమ్ తో సినిమాలు భారీ లెవల్ లో చేస్తూ ఉనే ఉండగా ఇప్పుడు మహాన్ సినిమా కి డిజిటల్ రిలీజ్ కి గాను ఏకంగా 40 కోట్ల రేంజ్ లో…
రేటుని చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. రీసెంట్ టైం లో హిట్ అనేది లేక పోయినా కానీ ఈ రేంజ్ లో రేటు సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు 10 న డిజిటల్ రిలీజ్ కానుండగా ఎంతవరకు సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి ఇక.