Home న్యూస్ విక్రమ్ మూవీ రివ్యూ……ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

విక్రమ్ మూవీ రివ్యూ……ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విక్రమ్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ నేడు రిలీజ్ అయింది, మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే…. కొకైన్ డీలర్ అయిన విజయ్ సేతుపతి కోట్ల విలువ చేసే కొకైన్ ఒక కంటైనర్ నిండా ఉంటుంది, ఆ కంటైనర్ మిస్ అవుతుంది….

దాంతో కొన్ని హత్యలు జరుగుతాయి…. దాంతో స్పెషల్ పోలిస్ అయిన ఫహాద్ రంగంలోకి దిగగా ఫహాద్ కి కమల్ గురించి ఓ మాస్క్ మాన్ గురించి తెలుస్తుంది, అసలు కమల్ ఎవరు, ఆ మాస్క్ మాన్ ఎవరు…వీళ్ళకి ఈ కథకి లింక్ ఏంటి లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ పరంగా కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ, కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకున్నా కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి విక్రం రచ్చ మొదలు అవుతుంది. ఇంటర్వెల్ సీన్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా ఆ అంచనాలను చాలా వరకు నిలబెడుతూ…

సెకెండ్ ఆఫ్ నడుస్తుంది, కమల్ హాసన్ తన రోల్ వరకు దుమ్ము లేపాడు, తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్షన్ కానీ, హీరోయిజం ఎలివేట్ సీన్స్ కానీ అదుర్స్ అనిపిస్తాయి, ఇక ఫహాద్ ఫాజిల్ కూడా తన రోల్ లో రేచ్చిపోగా విజయ్ సేతుపతి రోల్ కూడా కుమ్మేస్తుంది….. ఓ సడెన్ ట్విస్ట్ ఇస్తూ సూర్య రోల్ కూడా మెస్మరైజ్ చేస్తుంది….

అనిరుద్ సంగీతం ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ తో మరోసారి తన మ్యాజిక్ ని చూపించాడు…. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతుంది, ఫస్టాఫ్ కానీ సెకెండ్ ఆఫ్ కానీ ఆసక్తిని కలిగించే సీన్స్ ఉన్నప్పటికీ కూడా స్లో నరేషన్ ఒక స్టేజ్ దాటాక బోర్ కొట్టిస్తుంది…. డైలాగ్స్ బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ ఆకట్టుకుంది….

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్ రాసుకున్న గ్యాంగ్ స్టర్స్ స్టోరీని ఉన్నంతలో బాగానే ప్రజెంట్ చేసినా కానీ లెంత్ మరీ ఎక్కువ తీసుకున్నాడు… దాంతో ఎక్కువ సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేశాయి. కానీ వాటిని మరిపించేలా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఆకట్టుకుని…

మొత్తం మీద సినిమాను ఒకసారి చూడొచ్చు అనిపించేలా మెప్పించింది. మొత్తం మీద మరీ ఎక్కువ అంచనాలతో వెళితే కొంచం అంచనాలను అందుకొక పోవచ్చు కానీ, పెద్దగా అంచనాలు లేకుండా వెళితే కొంచం బోర్ ఫీల్ అయినా భారీ స్టార్ కాస్ట్, ఊహించని సెకెండ్ ఆఫ్ ట్విస్ట్ లతో సినిమా ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here