ఈ ఇయర్ కోలివుడ్ కి గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి…. కమల్ హాసన్ విక్రమ్ మరియు పొన్నియన్ సెల్వన్ 1 సినిమాలు బాక్ టు బాక్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇందులో విక్రమ్ మూవీ ముందు రిలీజ్ అయ్యి కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది, తెలుగు లో కూడా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…
తమిళ్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఒక్క హిట్ లేకుండా చాలా టైం హిట్ కోసం ఎదురు చూస్తున్న కమల్ హసన్ కి ఏకంగా ఇండస్ట్రీ హిట్ దక్కేలా చేసిన ఈ సినిమా….
కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన తర్వాత రీసెంట్ గా దీపావళి కానుకగా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. పండగ టైం లో ఇండస్ట్రీ హిట్ మూవీ కి ఇక సెన్సేషనల్ టి.ఆర్.పి రేటింగ్ లు ఖాయమని అంతా అనుకున్నారు కానీ…
అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తూ ఈ సినిమా కేవలం 4.10 TRP రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగానే నిరాశ పరిచింది. ఇండస్ట్రీ హిట్ మూవీ కి ఇది ఓవరాల్ గా ఫ్లాఫ్ రేటింగ్ అనే చెప్పాలి. అన్ని చోట్లా సంచలనం సృష్టించిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.