Home న్యూస్ విక్రాంత్ రోణ రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

విక్రాంత్ రోణ రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

0

కన్నడ ఇండస్ట్రీ నుండి రీసెంట్ టైం లో ఒకటి తర్వాత ఒకటి బిగ్ మూవీస్ వస్తూ ఉండగా ఇప్పుడు మరో బిగ్ పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ పాన్ ఇండియా లెవల్ లో భారీగా రిలీజ్ అయింది. కన్నడ బాద్ షా సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా పై కన్నడలో సాలిడ్ అంచనాలు ఉండగా మిగిలిన చోట్ల కూడా పర్వాలేదు అనిపించేలా బజ్ ని క్రియేట్ చేసిన సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….పీరియడ్ డ్రామా గా వచ్చిన ఈ సినిమా కథ కర్ణాటకలో కొమరట్టు అనే ఊరిలో జరుగుతుంది… ఒక పోలిస్ చనిపోవడంతో ఆ కేసు నిమిత్తం ఆ ఊరికి వస్తాడు హీరో… కానీ వచ్చాక మరో 16 మంది పిల్లలు కూడా చనిపోయారని, ఈ మర్డర్స్ అన్నింటికీ ఎదో…

సంభందం ఉందని గ్రహిస్తాడు…. అసలు ఆ మర్డర్స్ చేసింది ఎవరు, హీరో వాళ్ళని ఎలా కనిపెట్టాడు అన్నది హీరో ఎలా కనిపెట్టాడు అన్నది మొత్తం మీద స్టొరీ పాయింట్.. పెర్ఫార్మెన్స్ పరంగా సుదీప్ బాగా నటించి మెప్పించగా హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.

ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ బాగానే నటించగా సంగీతం ఆకట్టుకుంటుంది, రక్కమ్మ సాంగ్ ఎక్స్ లెంట్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఇక విజువల్స్ అండ్ గ్రాండియర్ కూడా టాప్ నాట్చ్ అనిపించే విధంగా మెప్పించాయి అని చెప్పాలి. మొత్తం మీద కథ పాయింట్ బాగున్నా లెంత్ ఎక్కువ అవ్వడం…

లవ్ ట్రాక్ అనుకున్న విధంగా లేక పోవడం…. స్టొరీని సాగదీసినట్లు అనిపించడం అలాగే కొంచం ఎక్కువగా కన్ఫ్యూజన్ కి గురి చేయడం  లాంటివి డ్రా బ్యాక్స్ అయినా కానీ రీసెంట్ టైం లో వచ్చిన సినిమాలతో పోల్చితే కచ్చితంగా బెటర్ క్వాలిటీ అండ్ కంటెంట్ ఉన్న సినిమాగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. 3D లో సినిమా ఇంకా బెటర్ గా అనిపించింది… మొత్తం మీద సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఈజీగా ఒకసారి చూడొచ్చు… మొత్తం మీద సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here