Home TRP రేటింగ్ ఇదేమి మాస్ రా బాబు…9 వ సారి కూడా సెన్సేషనల్ TRP రేటింగ్!

ఇదేమి మాస్ రా బాబు…9 వ సారి కూడా సెన్సేషనల్ TRP రేటింగ్!

1560
0

లాస్ట్ ఇయర్ సంక్రాంతి రేసు లో భారీ ఎత్తున రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ భారీ క్రేజ్ నడుమ రిలీజ్ అయినా కానీ రిలీజ్ అయిన మొదటి షోకే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా కానీ సినిమా ఓవరాల్ గా బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసింది.

డిసాస్టర్ టాక్ తో కూడా సినిమా 60 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా బుల్లితెర పై టెలికాస్ట్ అయిన మొదటి సారి కేవలం 7.9 TRP రేటింగ్ ని మాత్రమే సాధించింది. దాంతో సినిమా బుల్లి తెరపై కూడా డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుందని అన్నారు.

కానీ అదే సినిమా టెలివిజన్ తర్వాత క్రమం తప్పకుండా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా అద్బుతమైన TRP రేటింగ్ ని కంటిన్యు గా సాధిస్తూనే వచ్చింది. టెలివిజన్ లో ఈ సినిమా లాంగ్ రన్ లో మరే సినిమా సాధించని రేంజ్ విజయాన్ని అందుకుని ఊరమాస్ రికార్డ్ ను నమోదు చేసింది.

సినిమా ఇప్పటి వరకు 9 సార్లు టెలికాస్ట్ అవ్వగా ప్రతీ సారి ఏమాత్రం తగ్గని జోరు చూపించే TRP రేటింగ్ ని అందుకోవడం విశేషం. రీసెంట్ గా 9వ సారి టెలికాస్ట్ అయిన సినిమా కి 7.55 TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఒకసారి సినిమా టోటల్ గా టెలికాస్ట్ అయిన 9 సార్లు సాధించిన TRP రేటింగ్ ని గమనిస్తే…

👉1st time – 7.9 TRP
👉2nd time – 8.2 TRP
👉3rd time – 8.16TRP
👉4th time – 7.2 TRP
👉5th time – 8.18 TRP
👉6th time – 5.19 TRP
👉7th time – 6.35 TRP
👉8th time – 7.97 TRP
👉9th time – 7.55 TRP
ఇదీ సినిమా లాంగ్ రన్ లో టెలివిజన్ లో సాధించిన ఊచకోత. రీసెంట్ టైం లో ఒక సినిమా ఫ్లాఫ్ టాక్ తో ఈ రేంజ్ భీభత్సం సృష్టించడం ఇదే తొలిసారి అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here