కర్ణాటక గడ్డపై బిజినెస్ ఫైనల్…సేఫ్ జోన్ లో ఊచకోతకి సిద్ధం

0
156

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సినిమా సంక్రాంతి బరిలో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా రిలీజ్ టీసర్ మరియు మొదటి పాట కి మంచి రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా బిజినెస్ పరంగా కూడా జోరు చూపుతుంది.

పక్క రాష్ట్రం కర్ణాటక ఏరియా కి గాను సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ ఫైనల్ అయిందని తెలుస్తుంది. భారీ ఆఫర్స్ వస్తున్నా ఆ సమయం లో రిలీజ్ అయ్యే పోటి ని అలాగే సేఫ్ జోన్ లో ఉండటానికి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ అండ్ టీం సినిమా బిజినెస్ ని రీజనబుల్ గానే ముగించారు అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా బిజినెస్ 8.5 కోట్ల కి అటూ ఇటూ గా జరిగినట్లు సమాచారం. దీని పై ఇంకా ఫైనల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా కర్ణాటక లో సేఫ్ అవ్వడానికి భారీ కలెక్షన్స్ నే రాబట్టాల్సి ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here