వినయ విధేయ రామ ట్రైలర్ రివ్యూ…మినిమమ్ 80-100 కోట్లు పక్కా…ఏమంటారు??

2
180

   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వినయ విధేయ రామ అఫీషియల్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. 2018 ఎండింగ్ లో 2019 వన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో బోయపాటి టేకింగ్ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి.

మాస్ కోసం ఫైట్స్ ని ఎలివేషన్స్ ని పెట్టగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడానికి ఫ్యామిలీ సీన్స్ ని కూడా పెట్టి ట్రైలర్ అన్ని వర్గాలకు నచ్చే విధంగా కట్ చేశాడు బోయపాటి. ముఖ్యంగా రామ్ చరణ్ ని చూపెట్టిన విధానం, యాక్షన్ సీన్స్ టేకింగ్ చూస్తుంటే….

సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనిపించే లెవల్ లో మెప్పించాడు, దేవి సాంగ్స్ పరంగా జస్ట్ ఒకే అనిపించుకున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా మరోసారి తన మార్క్ చూపాడు. ఇక సినిమాలో ఆ సీన్స్ కి ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి.

సినిమా లో ఇతర పాత్రలకు పెద్దగా చూపెట్టక పోయినా కానీ సినిమా కథ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు బోయపాటి, ట్రైలర్ లో రామ్ చరణ్ డైలాగ్స్ బాగా పేలగా…ఓవరాల్ గా ట్రైలర్ అంచనాలను మించే విధంగా ఉందని చెప్పాలి.

ఇక ఇదే రెస్పాన్స్ సినిమా కి దక్కితే…సంక్రాంతి కి పోటి ఎంత ఉన్నా కానీ మినిమమ్ 80 నుండి 100 కోట్లు పక్కా అని చెప్పాలి. ఇక రంగస్థలం లాంటి లాంగ్ రన్ ఉంటె మరోసారి భీభత్సం పక్కా అని చెప్పాలి. మీరు ట్రైలర్ చూస్తె ఎలా ఉందొ చెప్పండి…


2 COMMENTS

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!