టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అందరూ కూడా చాలా వరకు ఎప్పుడు కలిసి మెలసి ఉంటారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా చాలా మంది కలిసి మెలసి ఉండటం జరుగుతుంది, అలాంటి డైరెక్టర్స్ లో ముందు నిలిచే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి మరియు వివి వినాయక్ లు, ఇద్దరూ ఆల్ మోస్ట్ ఒకే టైం లో కెరీర్ ని మొదలు పెట్టి టాలీవుడ్ లో మొదటి సినిమాలతోనే తమ మార్క్ ని…
చూపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్స్ గా మారిన ఈ ఇద్దరి లో ప్రస్తుతం రాజమౌళి ఒక్కడు సూపర్ ఫామ్ లో టాలీవుడ్ నుండి ఏకంగా నేషనల్ వైడ్ టాప్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకోగా వివి వినాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర….
వరుస ఫ్లాఫ్ మూవీస్ కారణంగా ప్రస్తుతం హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది, ఇలాంటి టైం లో వినాయక్ కి బాలీవుడ్ లో రాజమౌళి ఛత్రపతి సినిమా రీమేక్ ని బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసే అవకాశం దక్కగా ఈ సినిమా గురించి వినాయక్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..
నిర్మాత జయంతిలాల్ గడ దగ్గర ఛత్రపతి రీమేక్ హక్కులు ఉన్నాయని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆదరణ ఉన్న నేపథ్యంలో ఆ సినిమాని శ్రీనివాస్ తో రీమేక్ చేయాలనీ నన్ను అప్రోచ్ అయ్యారని, విజయేంద్ర ప్రసాద్ హిందీ కి మంచి మార్పులు చేశారని చెప్పుకొచ్చిన వినాయక్… దాంతో పాటు మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన అన్ని రాజమౌళి…
మూవీస్ లో ఏ సినిమాను రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అంటే… సింహాద్రి సినిమా పేరు చెప్పాడు వినాయక్, ఆ సినిమాలో పెర్ఫెక్ట్ కథ ఉంటుందని, మంచి స్క్రిప్ట్ ఉన్న గొప్ప కథని చెప్పాడు వినాయక్. ఛత్రపతి రీమేక్ చేస్తున్న వినాయక్, కుదిరితే సింహాద్రి రీమేక్ కి కూడా సిద్ధమే అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లే అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు.