బాహుబలితో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు వచ్చినా కానీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న రానా దగ్గుబాటి ఆడియన్స్ ముందుకు విరాట పర్వం సినిమాను ఎప్పుడో తీసుకు రావాల్సింది కానీ సినిమా ఎప్పటికప్పుడు ఎదో ఒక కారణంతో పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రెండేళ్ళ క్రితమే ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ…
అలా జరగలేదు…. తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవుతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి, కొన్ని రోజుల తర్వాత అసలు వార్తల్లోనే నిలవని ఈ సినిమా ను సడెన్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అద్బుతంగా ప్రమోట్ చేశారు సినిమా మెయిన్ లీడ్ అయిన…
రానా మరియు సాయి పల్లవిలు ఇద్దరూ కలిసి…. దాంతో తిరిగి లైం లైట్ లోకి వచ్చిన ఈ సినిమా పై ఇప్పుడు ఓవరాల్ గా ట్రేడ్ లో కొంచం బజ్ ఏర్పడగా ఆడియన్స్ లో మరీ అద్బుతం కాదు పర్వాలేదు అనిపించేలా బజ్ ఉందని చెప్పాలి. లేట్ రిలీజ్ అయినప్పటికీ కూడా…
సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ అనుకున్న అంచనాల కన్నా కూడా ఎక్కువే జరిగింది అని చెప్పాలి ఓవరాల్ గా… ఒకసారి సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 4Cr
👉Ceeded: 2Cr
👉Andhra: 5Cr
AP-TG Total:- 11CR
👉Ka+ROI: 1.00Cr
👉OS – 2Cr
Total WW: 14.00CR
ఇదీ మొత్తం మీద విరాట పర్వం సినిమా ఓవరాల్ గా సాధించిన వాల్యూ బిజినెస్….
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 14.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంది, ఎంతవరకు ఈ టార్గెట్ ను అందుకుని హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి ఇక…