Home న్యూస్ విరాట పర్వం రివ్యూ!!

విరాట పర్వం రివ్యూ!!

0

రానా దగ్గుబాటి సాయి పల్లవిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చినా ఎట్టకేలకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ…. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

1990 టైం లో జరిగే కథ ఇది…… పుట్టడమే నక్సల్స్ తో జీవితం ముడిపడి ఉన్న సాయి పల్లవి, పెరిగి పెద్ద అయిన తర్వాత మావోయిస్ట్ లీడర్ అయిన రానా రాసిన పుస్తకాలు కవితలు చదివి తనని ప్రేమిస్తుంది. ఇంతలో పెద్దలు తనకి పెళ్లి ఫిక్స్ చేయడంతో ఇంట్లో నుండి పారిపోయిన హీరోయిన్ హీరోని వెతుకుతూ అడవుల్లోకి వెళుతుంది…

తర్వాత ఏం జరిగింది, వీళ్ళ ప్రేమ సఫలం అయిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా సాయిపల్లవి ప్రతీ ఒక్కరినీ డామినేట్ చేసింది అని చెప్పాలి. తన నటన, డైలాగ్స్ అద్బుతంగా ఉండగా రానా కూడా తన రోల్ లో అదరగొట్టేశాడు.. ఇద్దరి సీన్స్ కూడా బాగా మెప్పించాగా మిగిలిన స్టార్ కాస్ట్ కూడా ఆకట్టుకున్నారు.

సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం ఫాస్ట్ గా ఉంటే ఇంకా బాగుండేది… సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే నీది నాది ఒకే కథ లాంటి అండర్ రేటెడ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిని డైరెక్ట్ చేసిన వేణు ఉడుగుల…

ఒక యదార్థ కథని తీసుకుని చాలా వరకు ఆ కథని న్యాయం చేశాడు, కానీ ప్రస్తుతం ఆ కథ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అవ్వడంతో ఇలాంటి నక్సలిజం నేపధ్యం, విప్లవాల నేపధ్యంలో సినిమాలను చూసే ఆడియన్స్ కి విరాట పర్వం కొంచం స్లో నరేషన్ ఇబ్బంది పెట్టినా వాళ్ళ మెప్పు బాగా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది…

కానీ కమర్షియల్ మూవీస్ తో మునిగి తేరుతున్న ప్రస్తుత సమయంలో ఇలాంటి నక్సలిజం కాన్సెప్ట్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఎంత మంది ఉంటారో చెప్పలేం… కానీ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీ ని చూడాలి అనుకున్న ఆడియన్స్ కొంచం ఓపిక తో చూస్తె మట్టుకు విరాట పర్వం హార్ట్ టచింగ్ తో పాటు….

క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్ గా కూడా అనిపించడం ఖాయం…. ఓవరాల్ గా సినిమా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కోసం, రానా కోసం ఒకసారి చూడొచ్చు అని చెప్పాలి. మొత్తం మీద నరేషన్ కొంచం ఎక్కువ స్లో గా ఉండటం లాంటివి కొంచం ఓపికతో బరిస్తే సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది…. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here