Home న్యూస్ విశాల్ చక్ర ట్రైలర్ రివ్యూ….ఈ సారి హిట్ పక్కా!!

విశాల్ చక్ర ట్రైలర్ రివ్యూ….ఈ సారి హిట్ పక్కా!!

796
0

యాక్షన్ సినిమా లతో తనకంటూ స్పెషల్ గుర్తుంపు ని తెచ్చుకుని తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసు కున్న హీరోలలో విశాల్ కూడా ఒకరు. కెరీర్ లో ఎక్కువ శాతం యాక్షన్ మూవీస్ నే చేసినా విశాల్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. కానీ రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ విజయాలను విశాల్ అందు కోలేక పోతున్నాడు.

డిక్టేటివ్, అభిమన్యుడు సినిమా లతో మంచి విజయాలను అందుకున్న విశాల్ తర్వాత చేసిన పందెం కోడి 2 తో కొంతవరకు మెప్పించాడు. కానీ తర్వాత చేసిన టెంపర్ రీమేక్ అయోగ్య కానీ తర్వాత చేసిన యాక్షన్ సినిమా లు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్నాయి.

ఇలాంటి టైం లో అభిమన్యుడు టైప్ కాన్సెప్ట్ ని మరో విధంగా తీసినట్లు తన లేటెస్ట్ మూవీ చక్ర అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. డిజిటల్ క్రైమ్స్ పై అలాగే బ్యాంక్ రాబరీ లు మిలటరీ వాళ్లకి ఇచ్చే అత్యన్నుతన ప్రదానాల్లో ఒకటైన చక్ర మెడల్ చుట్టూ…

సినిమా కథ ని బాగా అల్లుకోగా ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపెట్టాడు విశాల్, యాక్షన్ సీన్స్ లో ఎప్పటి లాగే రెచ్చి పోగా డబ్బింగ్ మూవీ లా అనిపించకుండా జాగ్రత్త తీసుకుని తెలుగు మూవీ నే అన్న భావన కలిగేలా చూసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తమిళ్, తెలుగు, మలయాళం అలాగే కన్నడ లో కూడా రిలీజ్ అవ్వడం విశేషం.

4 భాషల్లో రిలీజ్ కాబోతుందని చెబుతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా విశాల్ ఖాతాలో మంచి విజయాన్ని దక్కించుకునేలానే కనిపిస్తుందని చెప్పాలి. మరి లాక్ డౌన్ అయిపోయినా థియేటర్స్ తెరచుకోలేని పరిస్థితి ఉన్న నేపధ్యం లో కమింగ్ సూన్ అంటూ ట్రైలర్ లో చెప్పడం తో సినిమా థియేటర్స్ రీ రిలీజ్ అవ్వగానే ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here