Home న్యూస్ చక్ర ట్రైలర్ గ్లిమ్స్ రివ్యూ….మళ్ళీ కుమ్మేసిన విశాల్!!

చక్ర ట్రైలర్ గ్లిమ్స్ రివ్యూ….మళ్ళీ కుమ్మేసిన విశాల్!!

1562
0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న తమిళ్ హీరోలలో విశాల్ కూడా ఒకరు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఇక్కడ అభిమన్యుడు సినిమా తో భారీ విజయాన్ని నమోదు చేశాడు విశాల్. కానీ ఆ సినిమా తర్వాత చేసిన పందెం కోడి 2 అంతంత మాత్రమే అలరించగా తర్వాత చేసిన టెంపర్ రీమేక్ అయోగ్య డిసాస్టర్ అవ్వగా భారీ బడ్జెట్ మూవీ యాక్షన్ కూడా..

బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఇలాంటి టైం లో రిస్క్ లేని సబ్జెక్ట్ చేస్తాడు అనుకుంటే మళ్ళీ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో చక్ర అనే న్యూ మూవీ తో రాబోతున్నాడు విశాల్. లాక్ డౌన్ టైం కి ముందు సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అవ్వగా…

రీసెంట్ గా సినిమా ట్రైలర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. సైబర్ క్రైమ్స్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమా నే ఈ చక్ర అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ టేకింగ్ గ్లిమ్స్ లో చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నాయి అని చెప్పాలి. ఇక త్వరలోనే ఫుల్ ట్రైలర్ ని రిలీజ్ చేష్టారని సమాచారం.

అభిమన్యుడు సినిమా లో బ్యాంక్ రాబరీల నేపధ్యంలో సినిమా తీయగా ఈ సారి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, జనాలు ఎలా సఫర్ అవుతున్నారు. హీరో ఎలా వాటిని అరికట్టాడు అన్న నేపధ్యంలో సినిమా ఉత్కంట కలిగించే స్క్రీన్ ప్లే తో ఆద్యంతం అలరించే విధంగా ఉంటుందని యూనిట్ చెబుతుంది. ఇక సినిమా ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదనే చెప్పాలి.

లాక్ డౌన్ తీసినా కానీ థియేటర్స్ ఓపెన్ విషయాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కరోనా ఇంకా రెచ్చిపోతున్న నేపధ్యంలో మరో నెల 2 నెలలు థియేటర్స్ మూసే ఉండే అవకాశం ఎంతైనా ఉంది. సెప్టెంబర్లో రీ ఓపెన్ చేస్తారన్న టాక్ ఉంది అది ఎంతవరకు నిజం అవుతుందో అన్న దానిపై ఈ సినిమా రిలీజ్ డేట్ తెలుస్తుందట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here