Home న్యూస్ విశాల్ “చక్ర”….ఇంత తక్కువేంటి సామి!!

విశాల్ “చక్ర”….ఇంత తక్కువేంటి సామి!!

1371
0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు, అవడానికి తెలుగు వాడే అయినా తమిళ్ లో సెటిల్ అవ్వడం తో అక్కడ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని ఇక్కడ కూడా ఆ సినిమా లను క్రమం తప్పకుండా డబ్ చేస్తూ రెండు చోట్లా కూడా మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసు కున్న విశాల్ రీసెంట్ టైం లో మళ్ళీ….

ఫామ్ కోల్పోయిన విషయం తెలిసిందే, డిటెక్టివ్, అభిమన్యుడు మరియు పందెం కోడి 2 తో మంచి జోష్ మీదే ఉన్నా కానీ తర్వాత చేసిన టెంపర్ రీమేక్ అయోగ్య మరియు భారీ బడ్జెట్ మూవీ యాక్షన్ రెండూ కూడా అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యాయి.

ఆ ఎఫెక్ట్ గట్టిగానే ఉందని పించేలా రీసెంట్ గా రిలీజ్ అయిన విశాల్ చక్ర ట్రైలర్ కి రెస్పాన్స్ ఫుల్ పాజిటివ్ గా ఉన్నా కానీ ఓవరాల్ రీచ్ మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన మన తెలుగు BB3 రోర్ టీసర్ గ్లిమ్స్ కానీ లేక….

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ట్రైలర్ కానీ సాధించిన రీచ్ తో పోల్చితే విశాల్ చక్ర కి ఇప్పటి వరకు కేవలం 5 మిలియన్ వ్యూస్ 4 భాషల్లో కలిపి మాత్రమె దక్కడం కొంత షాకింగ్ గా ఉందని చెప్పాలి. రెస్పాన్స్ బాగున్నా సినిమా క్రేజ్ కి అద్దం పట్టేవి మాత్రం వ్యూస్ అండ్ లైక్స్ అనే చెప్పాలి రీసెంట్ టైం లో…

పెంగ్విన్ ని అమెజాన్ ప్రైమ్ బాగా ప్రమోట్ చేసింది, బాలయ్య సినిమా కి క్రేజ్ ఉంది, అదే సమయం లో విశాల్ ట్రైలర్ ని కూడా చాలా మంది స్టార్స్ తో ప్రమోట్ చేశాకే రిలీజ్ చేశారు, కానీ రీచ్ పెద్దగా సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. కానీ సినిమా మట్టుకు అంచనాలను మించేలా ఉండటం తో ఆ విషయం లో మాత్రం రీచ్ బాగా ఉండేలా ఉందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here