మంచు విష్ణు పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ జిన్నా దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమాకి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి లభించిన కానీ పోటి లో ఇతర సినిమాలను జనాలు చూడటానికి ఇష్టపడగా జిన్నా సినిమాను మాత్రం ఏమాత్రం ఆదరించలేదు, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ రన్ చాలా త్వరగానే కంప్లీట్ అయిపొయింది.
సినిమా బాక్స్ ఆఫీస్ రన్ చాలా నిరాశ కలిగించే విధంగా ఉండగా బడ్జెట్ ప్రకారం చూసుకుంటే అత్యంత భారీ నిరాశని కలిగించింది అని చెప్పాలి. కాగా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ అటూ ఇటూగా 12.50 కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారని…
ట్రేడ్ లో టాక్ ఉంది, హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ కొంచం ఎక్కువ వెళ్లిందని అంటూ ఉండగా ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువగా జరిగిందని, సినిమాను క్వాలిటీగా తీయడం వలన బడ్జెట్ పెరిగిందని అంటున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ లెక్కల్లో చెప్పాలి అంటే…
బడ్జెట్ లో 10% కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేయలేక తీవ్రంగా నిరాశ పరిచింది. సోలో గా రిలీజ్ అయ్యి ఉంటే సినిమా కి కొంచం బెటర్ రిజల్ట్ అండ్ కలెక్షన్స్ దక్కేవి కానీ పోటిలో రిలీజ్ అవ్వడం మాత్రం సినిమాకి సాలిడ్ గా దెబ్బ కొట్టింది అని చెప్పాలి.