Home న్యూస్ 24 గంటల్లో అన్ని ట్రైలర్ ల రికార్డులు మటాష్!

24 గంటల్లో అన్ని ట్రైలర్ ల రికార్డులు మటాష్!

661
0

కోలివుడ్ స్టార్ హిరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వాసం… భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై కోలివుడ్ లో అంచనాలు స్కై హై లెవల్ లో ఉన్నాయి. ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ మాత్రం అదిరి పోయే లెవల్ లో తొలి 24 గంటల్లో దక్కగా తర్వాత కూడా అదే ఫ్లో తో దూసుకు పోతుంది ఈ ట్రైలర్.

టోటల్ గా 24 గంటలు ముగిసే సమయానికి 14 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ లైక్స్ పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 1.2 మిలియన్ లైక్స్ ని 24 గంటల్లో సాధించి సౌత్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం రికార్డ్ కొట్టింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ నెలకొల్పిన రికార్డులతో సినిమా పై క్రేజ్ ఎలా ఉందొ అందరికీ మరోసారి రుజువు అవ్వగా సంక్రాంతి కి పోటి మరింత గట్టిగా ఉండటం ఖాయమని అక్కడ విశ్లేషకులు అంటున్నారు. యూట్యూబ్ రికార్డుల దుమ్ము దులిపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!