బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) లాస్ట్ మూవీ మెకానిక్ రాకీ తో ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు లైలా సినిమాతో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోలలో ప్రామిసింగ్ హీరోగా దూసుకు పోతున్న విశ్వక్ సేన్ సినిమా సినిమా కి…
డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ తన మార్కెట్ ను బాగానే స్టేబుల్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి. తన లేటెస్ట్ మూవీ లైలా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 8.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా…విశ్వక్ సేన్ నటించిన లాస్ట్ 6 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క..
ఇప్పుడు ఓవరాల్ గా 50 కోట్ల బిజినెస్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది. ఓ చిన్న హీరోకి కంటిన్యూగా ఇలాంటి బిజినెస్ లు సొంతం అవ్వడం కూడా విశేషం అనే చెప్పాలి.. ఒకసారి విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ సినిమాల టోటల్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
#VishwakSen Recent Movies WW Business Details
👉#Laila Movie – 8.20Cr****
👉#MechanicRocky – 8.50CR
👉#GangsofGodavari – 10.30CR
👉#Gaami – 10.20CR
👉#DasKaDhamki – 7.5CR
👉#Oridevuda – 5.50CR
మొత్తం మీద లిస్టులో ప్రస్తుతానికి ఒక్క మెకానిక్ రాకీ ఒక్కటి అంచనాలను అందుకోలేక పోయింది. మిగిలిన సినిమాలు మంచి రిజల్ట్ లనే సొంతం చేసుకోగా ఇప్పుడు లైలా మూవీ కూడా ఎంటర్ టైన్ మెంట్ బాగానే ఉండేలా ఉండటంతో ఈ సినిమా తో ఎలాంటి కలెక్షన్స్ ని విశ్వక్ సేన్ సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…