Home న్యూస్ విశ్వక్ సేన్ లైలా మూవీ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

విశ్వక్ సేన్ లైలా మూవీ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ వరుసగా మూడు సినిమాలను రిలీజ్ చేశాడు యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) అందులో 2 హిట్స్ గా నిలిస్తే ఒక ఫ్లాఫ్ పడింది…కానీ హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ ఒక ఫ్లాఫ్ మూవీ తో కొంచం ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా లైలా(Laila Movie Business) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు..

దాస్ క ధమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల తర్వాత మెకానిక్ రాకీ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఇలాంటి టైంలో ఫన్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్న లైలా మూవీ ట్రైలర్ పరంగా యూత్ ని బాగానే ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి…

ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా డీసెంట్ బజ్ ను సొంతం చేసుకోగా బిజినెస్ పరంగా పర్వాలేదు అనిపించేలా సేఫ్ సైడ్ బిజినెస్ నే చేశారు ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని సమాచారం…

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి మరో 2.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 8.2 కోట్ల రేంజ్ లో ఉంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇప్పుడు ఓవరాల్ గా…

9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ ను అందుకుని డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. ఇక వాలెంటైన్స్ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న లైలా మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here