నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు నన్ను నేనే లేపుకుంటా అంటూ స్టేజ్ పైన కామెంట్స్ చేసి అప్పటి నుండి మీమ్ మేకర్స్ కి టెంప్లెట్ గా తెగ పబ్లిసిటీ సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ తర్వాత హిట్ సినిమా టైం లో నార్మల్ గానే ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ పాగల్ సినిమా టైం లో సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండగా సినిమా మీద నెగటివ్ రివ్యూలు నెగటివ్ టాక్ రావడం తో…
ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా భావిస్తున్నాడు. రీసెంట్ గా తను నటించిన పాగల్ సినిమా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి కొందరి నుండి పాజిటివ్ టాక్ కొందరి నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది, కానీ విశ్వక్ సేన్ జనాలలో సినిమాను ప్రమోట్ చేస్తూ….
ప్రతీ చోటికి వెళ్లి సినిమాను జనాలకు రీచ్ అయ్యేలా చేస్తూ సినిమా కి కలెక్షన్స్ ని తానె స్వయంగా తెప్పిస్తున్నాడు. ఇదే టైం లో రీసెంట్ గా మీట్ లో స్టేజ్ మీద సినిమా గురించి మాట్లాడిన తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశారు… నేను చెబుతున్నా నా మీద ఓ రేంజ్ లో….
నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది, అది ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయింది అనేది ఏం తెలియదు….ఇది ఎవ్వరూ తట్టుకోలేరు… కనిపించని శత్రువుతో కొట్లాడుతున్నాను, కానీ గుర్తు పెట్టుకోండి… అవతల దిక్కు ఎవరున్నారో తెలియదు కానీ ఇక్కడ ఉంది ఒక్కడినే అంటూ కామెంట్స్ చేశాడు విశ్వక్ సేన్… మరి పని గట్టుకుని విశ్వక్ సేన్ మీద అంతలా నేగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఎవరో…
విశ్వక్ సేన్ నే ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు, లేదా ఇదంతా విశ్వక్ సేన్ తనకి తాను అనుకుంటున్నాడో కూడా క్లారిటీ లేదు… స్టేజ్ పైన కొన్ని ఓవర్ ది టాక్ కామెంట్స్ కానీ ఫలక్నుమా దాస్ టైం లో కొన్ని ఇంసిడెంట్ లు కానీ తన పై కొద్దిగా విమర్శలు వచ్చేలా చేశాయి, కానీ హిట్ మూవీ టైం కి అంతా నార్మల్ గానే ఉంది. కానీ పాగల్ టైం లో ఇలాంటివి పబ్లిసిటీ కోసమా లేక నిజంగానే జరుగుతుందా అన్నది హీరోకే తెలియాలి.