కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో సందీప్ కిషన్ ఒక స్పెషల్ రోల్ లో తానె నిర్మాతగా మారి నిర్మించిన సినిమా వివాహ భోజనంబు.. టైటిల్ తో బాగా మెప్పించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మంచి కామెడీ ఎంటర్ టైనర్ లా కనిపించింది. రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మరి ట్రైలర్ కి మించి ఎంటర్ టైన్ చేసిందా లేదా లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే…. హీరో అందగాడు కాదు పైగా పీసినారి, హీరోయిన్ ఫ్యామిలీ చాలా రిచ్… దాంతో హీరోయిన్ ఫ్యామిలీ అసలు హీరోయిన్ కి హీరో ఎలా నచ్చాడు అంటూ పెళ్లికి నో చెబుతూనే కొన్ని కారణాల వలన ఓకే చెబుతారు. అందరు హీరో ఇంటికి వచ్చిన టైం లో…
కరోనా లాక్ డౌన్ పెట్టేస్తారు… పీసినారి అయిన హీరో టోటల్ హీరోయిన్ ఫ్యామిలీని అన్ని రోజులు ఎలా భరించాల్సి వచ్చింది. ఈ లోపు హీరో గురించిన మరిన్ని సీక్రెట్స్ హీరోయిన్ ఫాదర్ కి తెలిసిన తర్వాత ఏం జరిగింది లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
ఆల్ మోస్ట్ ట్రైలర్ లోనే సినిమా కథని రివీల్ చేశారు అనుకున్నాం కానీ సినిమాలో ఉన్న కామెడీ సీన్స్ అన్ని కూడా ట్రైలర్ లోనే చూపెట్టారు అని సినిమా చూశాక తెలుస్తుంది. ట్రైలర్ ఉన్న సీన్స్ తప్ప వేరే కొత్త కామెడీ సీన్స్ ఎక్కడా కనిపించవు సినిమాలో సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే మెయిన్ ప్రాబ్లం అర్ధం అవ్వగా ఎప్పుడెప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా అని ఆడియన్స్…
ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. మధ్యలో వచ్చే సందీప్ కిషన్ ఎపిసోడ్ కామెడీ పెంచాల్సింది పోయి మరింత బోర్ కొట్టేలా చేస్తుంది. ఇన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ నటుడిగా సత్య అద్బుత నటనతో మెప్పించాడు. తనని ఇంకా బెటర్ గా వాడుకుంటే సునీల్ రేంజ్ కామెడీ చేయగల సత్తా ఉన్న నటుడు… హీరోయిన్ ఓకే, మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదు అనిపించగా 2 గంటల లెంత్ మాత్రమె…
ఉన్నప్పటికీ కూడా చాలా ఓపిక చేసుకుని ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా అని ఎదురు చూసేలా ఉంది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్… ముందుగా చెప్పినట్లే ట్రైలర్ లో చూపెట్టిన సీన్స్ మినహా పెద్దగా కామెడీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు.. కానీ కొంచం ఓపికతో చూస్తె సినిమా యావరేజ్ రేంజ్ లో అనిపిస్తుంది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…
Niku yevadu cheppadu bayya yenta super undhi movie eppude movie kuda chusina ekkada boor kuda kottaledhu