నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. బాలయ్య కెరీర్ లోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ అని చెప్పాలి. ప్రీ సేల్స్ ద్వారానే ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా రాయలసీమలో ఊహకందని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. బాలయ్య సినిమాలకు ఇది వరకు నైజాం ఏరియాలో…
బుకింగ్స్ అంతంత మాత్రమే ఉండేవి కానీ ఈ సినిమా బుకింగ్స్ నెక్స్ట్ లెవల్ రాంపేజ్ ను చూపిస్తూ బాలయ్య కెరీర్ బెస్ట్ గా దూసుకు పోతుంది. సినిమా కొన్ని చోట్లా స్ప్రెడ్ అయిన యావరేజ్ రేంజ్ టాక్ వలన కొంచం డ్రాప్స్ ఉన్నా కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం…
సినిమా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, అంతకన్నా ఎక్కువ వస్తే అది నెక్స్ట్ లెవల్ ఊచకోత అని చెప్పొచ్చు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…
మొదటి రోజు 26 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, రాయలసీమలో సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఈ రేంజ్ లోనే ఉంటుందా లేక ఇంతకు మించి ఉంటాయో చూడాలి ఇక…