బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా మొదటి మూడు రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది బాలయ్య ప్రీవియస్ మూవీ అఖండతో కంపేర్ చేస్తే… కానీ వాల్తేరు వీరయ్య హావా ముందు సినిమా స్లో అయింది అనే చెప్పాలి. 4వ రోజు సంక్రాంతి పండగ అలాగే ఆదివారం అవ్వడంతో మంచి జోరు నే చూపిస్తూ ఉంది కానీ….
పోటిలో ఉన్న వాల్తేరు వీరయ్యతో పోల్చితే చాలా వెనకే ఉందని చెప్పాలి. కంప్లీట్ మాస్ మూవీ అవ్వడం, వాల్తేరు వీరయ్యలో ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ అవ్వడంతో మాస్ సెంటర్స్ తప్పితే మిగిలిన చోట్ల వీర సింహా రెడ్డి ప్రభావం అనుకున్న విధంగా లేదు…
ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 4వ రోజు ఆల్ మోస్ట్ 3వ రోజు లెవల్ లోనే జోరు చూపించినా కొన్ని చోట్ల థియేటర్స్ ని ఇతర సంక్రాంతి మూవీస్ కి ఇచ్చారు. ఆ ఇంపాక్ట్ కూడా కలెక్షన్స్ పై పడనుండగా సినిమా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల నుండి…7 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే కలెక్షన్స్ పెరగవచ్చు. ఇక ఓవర్సీస్ లో పెద్దగా ఇంప్రూవ్ మెంట్ లేక పోవడంతో కర్ణాటకలోనే కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 7.50 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక టోటల్ గా 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.