నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఓపెనింగ్స్ రికార్డులను క్రియేట్ చేసినా తర్వాత స్లో డౌన్ అయిన సినిమా ఉన్నంతలో బిజినెస్ ను దాటేసి ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకుని ఇప్పుడు పరుగును పూర్తీ చేసుకుని త్వరలో డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
ఇక సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ త్వరలో తెలియనుండగా సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. బాలయ్య నటించిన అఖండ సినిమా డిస్నీ ప్లస్ లో ఊరమాస్ వ్యూవర్ షిప్ ను…
సొంతం చేసుకోగా ఆ ఇంపాక్ట్ వలన బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా కోసం ఏకంగా 13.5 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ వాళ్ళు సొంతం చేసుకున్నారు…. ఇక సినిమా అతి త్వరలో డిజిటల్ లో రిలీజ్ కానుండగా 45 రోజుల టైం గ్యాప్ తో…
సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. అంతకన్నా ముందు కూడా సినిమా డిజిటల్ రిలీజ్ కావొచ్చు. ఓవరాల్ గా ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య తన అప్ కమింగ్ మూవీస్ తో ఇంకా ఎలాంటి అద్బుతాలను సృష్టిస్తాడో చూడాలి.