నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని అందుకున్నా తర్వాత మాత్రం ఆ రేంజ్ లో హోల్డ్ చేయలేదు, కానీ ఉన్నంతలో లిమిటెడ్ కలెక్షన్స్ తోనే రన్ ని కొనసాగించిన సినిమా ఇప్పుడు ఒక్కో ఏరియాలో పరుగును పూర్తీ చేసుకుంటుంది. లేటెస్ట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో పరుగును ఇప్పుడు టోటల్ గా…
కంప్లీట్ చేసుకుందని చెప్పాలి…. బాలయ్య కెరీర్ లో మూడో 1 మిలియన్ మూవీగా నిలిచిన వీర సింహా రెడ్డి ఓవరాల్ గా అక్కడ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది ఇప్పుడు…
అఖండ అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకోగా వీర సింహా రెడ్డి ఆ మార్క్ ని దాటేసి ఇప్పుడు టోటల్ రన్ లో 1.11 మిలియన్ డాలర్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుంది అక్కడ… ఇండియన్ కరెన్సీలో టోటల్ గ్రాస్ లెక్క 9.10 కోట్ల రేంజ్ లో ఉంటుందని చెప్పాలి…
ప్రీమియర్స్ తోనే ఏకంగా 7 లక్షలకు పైగా డాలర్స్ ను వసూల్ చేసిన సినిమా ఊహకందని స్టార్ట్ ను సొంతం చేసుకున్నా తర్వాత కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయిపొయింది. అయినా కానీ ఉన్నంతలో అక్కడ బాలయ్య కెరీర్ లో నంబర్ 2 మూవీ గా నిలిచి పరుగును పూర్తీ చేసుకుంది.