నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఆల్ మోస్ట్ పరుగు ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. సినిమా ఒక్కో ఏరియాలో పరుగును పూర్తీ చేసుకుంటూ ఉండగా ఇప్పుడు సినిమా నైజాం ఏరియాలో కూడా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. సినిమా 5వ వారంలో మొత్తం మీద 5 థియేటర్స్ లోనే రన్ అవుతూ ఉండగా ఆల్ మోస్ట్ ఇక రన్…
ఎండ్ అయినట్లే అని చెప్పాలి ఇప్పుడు. సినిమా నైజాం ఏరియాలో మొత్తం మీద 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్ డే రోజున రికార్డ్ కలెక్షన్స్ ని బాలయ్య కెరీర్ లో అందుకున్న సినిమా తర్వాత వాల్తేరు వీరయ్య జోరు వలన స్లో అవ్వగా…
ఉన్నంతలో పండగ సెలవుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంతో తర్వాత స్లో అయినా కానీ మొత్తం మీద ఇక్కడ బిజినెస్ ను దాటేసి తర్వాత లాభాలను కూడా సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం ఏరియాలో…
పరుగు కంప్లీట్ అయ్యే టైంకి 17.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. ఈ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 15 కోట్ల బిజినెస్ మీద 2.38 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. అఖండని అందుకోక పోయినా ఈ ఏరియాలో బాలయ్య కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నిలిచింది.
బాలయ్య మూవీ స్లో కాలేదు దియోటర్లు తగ్గించటం వల్ల కలెక్షన్స్ తగ్గాయి కొన్ని వెబ్ సైట్లు ఒక పార్టీ లో పాల్గొని డబ్బులు పుచ్చుకొని బాలయ్య మూవీ నీ నెగెటివ్ కామెంట్స్ రాసి మూవీ నీ ప్లాప్ చేయాలనుకున్నారు. కానీ మూవీ హిట్ అయ్యింది. బాలయ్య కి ఫేక్ కలెక్షన్ లు అవసరం లేదు
Yes correct, balayya doesn’t like fake collections, some of websites are writing negative reviews and news, this is all nothing will damage balayya image