బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి మూవీస్ వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తం మీద వీర సింహా రెడ్డి సినిమా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా 115 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా…..
157 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. ఇక వీర సింహా రెడ్డి సినిమా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 4 కోట్ల నుండి 4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవాకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 5 కోట్ల లోపు గ్రాస్ ని అందుకోవచ్చు.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు వరల్డ్ వైడ్ గా 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కలెక్షన్స్ తో…
వీర సింహా రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 120 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కి గాను 166 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవచ్చు. ఇక రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఇదే విధంగా ఉంటాయో లేక కొంచం పెరుగుతాయో చూడాలి.
After all Megastar is a mega star, he is the box office king for pogal festival