బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ సంక్రాంతి లాంగ్ వీకెండ్ కంప్లీట్ అయింది, కనుమ పార్షిక హాలిడే అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చి సంక్రాంతి సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి. కాగా 2 సినిమాలు కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నాయి. కానీ అందుకోవాల్సి టార్గెట్ లు తక్కువగానే ఉండటంతో కొంచం కొంచం కలెక్షన్స్ తో పరుగును…
స్టడీగా కొనసాగించినా రెండు సినిమాలు హిట్ గీతని దాటడం ఖాయం. ఇక వీర సింహా రెడ్డి 6వ రోజు ఆల్ మోస్ట్ 65-70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. నైజాంలో డ్రాప్స్ చాలా ఎక్కువగా ఉండగా ఆంధ్రలో సీడెడ్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది సినిమా…
ఇక వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఆల్ మోస్ట్ 60% పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాలలో… కానీ వీర సింహా రెడ్డితో పోల్చితే చాలా బెటర్ గానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె….
వీర సింహా రెడ్డి సినిమా 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల నుండి 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా 3.75 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోల హోల్డ్ ని బట్టి కలెక్షన్స్ పెరగవచ్చు… ఇక డే ఎండ్ అయ్యే టైంకి ఏ సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.