Home న్యూస్ ఆ సీన్లు పడుంటే “రామ్ చరణ్” “వినయ విధేయ రామ” బ్లాక్ బస్టర్ అయ్యేదట

ఆ సీన్లు పడుంటే “రామ్ చరణ్” “వినయ విధేయ రామ” బ్లాక్ బస్టర్ అయ్యేదట

901
0

     2019 ఇయర్ లో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను అస్సలు అక్కట్టుకోలేకపోయిన సినిమాల్లో ముందువరుసలో నిలిచే సినిమా వినయ విధేయ రామ. వరుసగా మంచి సినిమాలు తీసిన బోయపాటి తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడింది. అతి సామాన్యమైన స్టోరీని ఇంత భారీ కాస్ట్ తో తీయడంతో అనుకున్న రిజల్ట్ రాలేదు. ఆఖరికి భారీ హైర్స్ సినిమా కి హెల్ప్ చేసినా కానీ సంక్రాంతి సెలవుల తర్వాత సినిమా తేరుకోలేక ఫ్లాఫ్ అయింది.

ఇలాంటి నాసిరకం సినిమా చేసినందుకు రామ్ చరణ్ ని అనాలా, ఇలాంటి స్టోరీ కి స్క్రీన్ ప్లే రాసిన బోయపాటి శ్రీను టీం అని అనాలా, లేక ప్రేక్షకులకు ఊపు ఇచ్చే ఒక్క సీన్ తీయలేకపోయిన బోయపాటి శ్రీనుని అనాలా అంటే బోయపాటి శ్రీనునే అనాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు…

ఈయన లెజెండ్ తరువాత తీసిన సరైనోడు మరియు జయ జానాకి నాయక లాంటి సినిమాలు మిక్సుడ్ టాక్ ని తెచ్చుకున్నా సరైనోడు హిట్ అయినా జయ జానాకి నాయక డిసాస్టర్ అయింది. అయినా కూడా వినయ విధేయ రామ చాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్ మెగాస్టార్ లు.

ఈ సినిమా ముందు అనుకున్న స్టోరీ తరువాత సెట్స్ కి వెళ్ళాక మారిన స్టోరీ వేరని సెట్స్ పైకి వెళ్ళాక మారిన స్టొరీ వేరని అంటున్నారు. చిరు రామ్ చరణ్ లు అలాగే నిర్మాతలు కలిసి 72 సూపర్ సీన్లు అనుకుని సినిమాలో పెట్టాలని కోరారట.. కానీ అవి బాలేవని కథ కి సెట్ అవ్వవు అని అందులో కేవలం 4 సీన్స్ ని మాత్రమే తీసుకుని మిగిలినవి వదిలేశాడని అంటున్నాడు.

ఆ సీన్స్ కనుక ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా పెట్టి ఉంటే సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యి ఉండేదని సంక్రాంతి కి రికార్డులు బద్దలు అయ్యేవని అంటున్నారు.. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ చివరికి టోటల్ తప్పు బోయపాటి పైకే వెళుతుండటం విచార కరమనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here