Home TRP రేటింగ్ మెంటల్ మాస్ రికార్డ్…10 సార్లు టెలికాస్ట్ చేస్తే…ఎన్ని సార్లు 7.5 పైగా రేటింగ్ వచ్చిందో తెలిస్తే...

మెంటల్ మాస్ రికార్డ్…10 సార్లు టెలికాస్ట్ చేస్తే…ఎన్ని సార్లు 7.5 పైగా రేటింగ్ వచ్చిందో తెలిస్తే షాక్!!

518
0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన ప్రతీ సినిమా టెలివిజన్ లో కూడా హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు, అదే టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన ప్రతీ సినిమా బుల్లి తెరపై కూడా నిరాశ పరచాలని రూల్ ఏమి లేదు. సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా.

లాస్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయినా సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ వలన బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చింది. ఇక భారీ రేటు కి సినిమా శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకుంది.

ఆ రేటు సుమారు 16 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.. ఆ రేటు ప్రకారం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కేవలం 7.9 టి.ఆర్.పి రేటింగ్ ని మాత్రమె దక్కించుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కానీ అసలు ఆట తర్వాతే మొదలు అయింది. టెలికాస్ట్ అయిన ప్రతీ సారి సెన్సేషనల్ టి.ఆర్.పి తో దుమ్ము లేపింది ఈ సినిమా.

ఓవరాల్ గా ఇప్పటి వరకు 10 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా అందులో ఏకంగా 7 సార్లు ఏకంగా 7.5 కన్నా ఎక్కువ రేటింగ్స్ ని దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. రీసెంట్ గా 10 వ సారి టెలికాస్ట్ అయిన సినిమా మళ్ళీ 7.51 రేటింగ్ ని దక్కించుకుని ఊచకోత కోసింది.

ఒకసారి ఇప్పటి వరకు సినిమా సాధించిన రేటింగ్స్ ని గమనిస్తే..
👉1st time – 7.9 TRP
👉2nd time – 8.2 TRP
👉3rd time – 8.16TRP
👉4th time – 7.2 TRP
👉5th time – 8.18 TRP
👉6th time – 5.19 TRP
👉7th time – 6.35 TRP
👉8th time – 7.97 TRP
👉9th time – 7.55 TRP
👉10th time – 7.51 TRP
ఇదీ సినిమా టెలివిజన్ లో సాధించిన ఊచకోత రేటింగ్స్.. ఇంకా లాంగ్ రన్ లో మరెన్ని అద్బుతాలు ఈ సినిమా సృష్టిస్తుందో చూడాలి…

Vinaya Vidheya Rama A Box Office Flop....Television Monstrous Hit

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here