Home న్యూస్ 86 ఏళ్ల చరిత్రలో నంబర్ 1 గా రామ్ చరణ్ వినయ విధేయ రామ

86 ఏళ్ల చరిత్రలో నంబర్ 1 గా రామ్ చరణ్ వినయ విధేయ రామ

3340
0

      టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ తెలుగు సినిమా చరిత్రలోనే రేర్ హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

సినిమా మొదటి వారం ముగిసే సరికే బాక్స్ ఆఫీస్ దగ్గర 56 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా 8 వ రోజు వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ రివ్యూ లతో అత్యధిక షేర్ వసూల్ చేసిన సినిమా గా సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది.

సినిమా ఇది వరకు నంబర్ 1 గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25 వ సినిమా అజ్ఞాతవాసి సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఆ సినిమా ఫైనల్ రన్ లో 57.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని నెగటివ్ రివ్యూ లలో తక్కువ రేటింగ్ తో ఎక్కువ..

కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలవగా తొలిరోజు ఆ సినిమా హైర్స్ రూపం లో 8.5 కోట్ల రేంజ్ లో దక్కడం తో లాంగ్ రన్ లో హెల్ప్ అయింది, ఇప్పుడు వినయ విదేయ రామ విషయం లో కూడా తొలిరోజు యాడ్ చేసిన 10.8 కోట్ల హైర్స్ బాగా…

హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా 65 కోట్ల లోపు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును ఆపే అవకాశం ఉందని సమాచారం. తొలి ఆటకి వచ్చిన టాక్ కి ఈ రేంజ్ లో వసూళ్లు అన్నా కూడా రికార్డ్ అనే చెప్పాలి. కానీ కొన్న వాళ్లకి భారీ నష్టాలు ఖాయం అయిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here