టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమా వినయ విధేయ రామ. భారీ అంచనాల నడుమ సంక్రాంతి రేసు లో భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం తొలి రోజు హైర్స్ తో భారీ గా రికార్డులు కొట్టగా తర్వాత సంక్రాంతి హాలిడేస్ వలన 8 వ రోజు వరకు…
సాలిడ్ కలెక్షన్స్ ని సాధించినా తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయింది, దాంతో అనుకున్న టార్గెట్ కి మరింత క్లోజ్ గా వెళుతుంది అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఫైనల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. Nizam- 12.84C, Ceeded- 11.65C, UA- 8.33C, Nellore- 2.9C, Guntur- 6.56C, Krishna- 3.8C, West- 4.48C, East- 5.51C, Total AP & Nizam – 56.07C, Ka : 5.25 Cr, ROI : 0.7 Cr, USA 0.6cr, ROW : 0.8 Cr, Worldwide : 63.42 Cr
సినిమాను టోటల్ గా 90 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 91 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఫైనల్ గా 63.42 కోట్ల షేర్ ని వసూల్ చేసి సుమారు 26.6 కోట్ల దాకా నష్టాన్ని మిగిలించి డిసాస్టర్ గా మిగిలిపోయింది.
కానీ సినిమా కి తొలిరోజు వచ్చిన నెగటివ్ టాక్ కి, మినిమమ్ 1.5 టు 2 స్టార్ రేటింగ్ తో ఏకంగా 14 కోట్ల వరకు హైర్స్ ని సాధించి ఫైనల్ గా ఫ్లాఫ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమాగా నిలిచింది ఈ సినిమా… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.