Home న్యూస్ వాల్తేరు వీరయ్య రివ్యూ….రేటింగ్!!

వాల్తేరు వీరయ్య రివ్యూ….రేటింగ్!!

3

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.సినిమా ప్రోమోలు, పాటలు తర్వాత వచ్చిన ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది రొటీన్ మూవీనే అంటూ ముందే చెప్పిన మేకర్స్ ఆడియన్స్ ను మాత్రం అలరిస్తుంది అన్న నమ్మకం వ్యక్తం చేశారు. మరి అది ఎంతవరకు నిజం అయింది, సినిమా ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

జాలరి అయిన వాల్తేరు వీరయ్య ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి మలేషియా వెళ్ళాల్సి వస్తుంది, ఆ క్రిమినల్ ని పట్టుకునే క్రమంలో వాల్తేరు వీరయ్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి… రవితేజ రోల్ ఏంటి ఇలాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… టీం ముందే చెప్పినట్లు ఇది పక్కా రొటీన్ కమర్షియల్ మూవీ…. కథ ఏంటి అనేది ఆడియన్స్ యిట్టె చెప్పేయగలరు… సో అది ముందే తెలిసి ప్రిపేర్ అయ్యి వెళితే మంచింది….

మెగాస్టార్ తన రోల్ వరకు బాగా నటించాడు, ఇంట్రో సీన్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ ఎక్స్ లెంట్ అని చెప్పాలి. ఇంట్రో సీన్ గ్రాఫిక్స్ పూర్ గా ఉన్నాయి. చాలా సీన్స్ లో వింటేజ్ చిరు గుర్తుకు రావడం ఖాయం కానీ కామెడీ అనుకున్నట్లు వర్కౌట్ అవ్వలేదు, ఫోర్స్ గా అనిపించింది, ఇక రవితేజ రోల్ చిన్నదే అయినా బాగా మెప్పించగా ఇద్దరు హీరోల సీన్స్ చాలా బాగున్నాయి అని చెప్పాలి.

శృతి హాసన్ రోల్ జస్ట్ ఓకే అనిపించగా ప్రకాష్ రాజ్, బాబీ సింహా రోల్స్ కూడా పర్వాలేదు, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ రెండిటిలో కూడా ఈ సారి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నాడు, ఫైట్స్ కి ఎలివేషన్స్ కి తన బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా ఉంది…  ఎడిటింగ్ వీక్ గా ఉండగా స్క్రీన్ ప్లే కూడా వీక్…. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే బాబీ వింటేజ్ చిరును ఉన్నంతలో బాగానే ప్రజెంట్ చేసి ఇంట్రో, ఇంటర్వెల్ రవితేజతో కాంబో సీన్స్, అలాగే సాంగ్స్ లో డాన్స్ ను బాగా మ్యానేజ్ చేశాడు కానీ కథ ఏమి లేక పోవడంతో అవి మినహా మిగతా కథ నత్తనడకన సాగుతుంది… క్లైమాక్స్ నుండి ఇంకా ఎదో ఆశిస్తే సింపుల్ గా కథని ఎండ్ చేశారు… పార్టు పార్టులుగా ఓకే కానీ ఓవరాల్ గా మాత్రం డైరెక్టర్ కి ఫుల్ మార్కులు పడవు….

మొత్తం మీద ఇద్దరు హీరోల కాంబో సీన్స్, 3 సాంగ్స్, మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ లు మెప్పించినా కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వక పోవడం, రొటీన్ కథ, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ పెద్దగా లేక పోవడం, స్క్రీన్ ప్లే అండ్ లాంగ్ సినిమా మేజర్ డ్రా బ్యాక్స్…. కానీ ముందే చెప్పినట్లు ఇది రొటీన్ మూవీ అని ముందే ఫిక్స్ అయ్యి థియేటర్స్ కి వెళితే పార్టు పార్టులుగా సినిమా పర్వాలేదు బాగుంది అనిపిస్తుంది…

వింటేజ్ చిరు సీన్స్ కొన్నింటిని ఎంజాయ్ చేయోచ్చు, అలాగే రవితేజతో కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి… ఓవరాల్ గా ఫ్యాన్స్ కి అయితే సినిమా ఫీస్ట్ లా అనిపించడం ఖాయం కానీ కామన్ ఆడియన్స్ కి సినిమా మరీ అద్బుతం కాదు కాని మెగాస్టార్ లాస్ట్ 2 మూవీస్ తో పోల్చితే ఆడియన్స్ ను అలరించే అంశాలు అయితే ఇందులో ఉన్నాయి అనడంలో సందేహం లేదు.. రొటీన్ స్టొరీని కొంచం ఓపికతో చూస్తె ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది వాల్తేరు వీరయ్య మూవీ… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here