ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో సాలిడ్ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సినిమాల్లో టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) మీద ఓ రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయి అని చెప్పాలి.
ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా గురించిన ఒక్క పోస్టర్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్న నిర్మాతలు ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు…
వార్1 తో పోల్చితే వార్2 లో ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఉంటుదని ముందు నుండే చెప్పగా ఎన్టీఆర్ ను ఎలా ప్రజెంట్ చేసి ఉంటారు, హిందీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఎలా తన రోల్ ఉంటుంది అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూడగా…
రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ చూసిన తర్వాత సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై కొంత క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. కొంచం కథ పాయింట్ ను కూడా చెబుతూఇండియాస్ బెస్ట్ సోల్జర్ అయిన హృతిక్ ని వెంటాడే వ్యక్తిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టీసర్ లో చూపించారు…
ఇక్కడ ఇద్దరు హీరోలకు షాట్స్ సమానంగా పడినప్పటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీసర్ మంచి ఊపునే అందుకుంది, తన షాట్స్ కూడా బాగున్నాయి…కానీ ఉన్నవి తక్కువ షాట్స్ అయితే స్లో మోషన్ ఎఫెక్ట్స్ తో హృతిక్ కొన్ని షాట్స్ లో తన స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు…
ఇక కథ పాయింట్ కొంచం వార్1 నే తలపించేలా ఉన్నట్లు అనిపించడంతో కొత్తదనం ఏమి లేదా అన్నట్లు అనిపించింది… ఓవరాల్ గా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆఫ్ 2025 ఇయర్ అయిన వార్2 హిందీలో మాస్ ఊచకోత కోసే అవకాశం ఉంది.
ఇక తెలుగు లో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం డబ్బింగ్ మూవీస్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంది. సినిమా హిందీలో రూపొందగా మిగిలిన భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ టీసర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.