ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) సినిమా ఒకటి కాగా…సినిమా మీద ఉన్న హైప్ కి….
ఏమాత్రం టాక్ బాగున్నా రికార్డుల భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి… ఇక సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ మీద ఉన్న అంచనాలను పూర్తిగా టీసర్ అందుకోలేక పోయింది. కథ పాయింట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు టాప్ స్టార్స్..
కలిసి చేస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ మల్టీ స్టారర్ అయిన వార్2 మూవీ విషయంలో గ్రాఫిక్స్ మరింత షార్ప్ గా ఉండాల్సిన అవసరం ఉందని టీసర్ చూస్తె తెలుస్తుంది….VFX విషయంలో ఇది వరకు యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో వచ్చిన పఠాన్ లో గ్రాఫిక్స్ పై కంప్లైంట్స్ రావడంతో…
మేకర్స్ శ్రద్ధతో సినిమా రిలీజ్ టైంకి అన్నీ చాలా వరకు సెట్ చేసుకున్నారు…ఇక ఇప్పుడు వార్2 మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఇదే కంప్లైంట్ మేజర్ గా రావడంతో టీం ఈ విషయాన్నీ నోట్ చేసుకోగా…అలాగే టీసర్ కట్ ప్రాపర్ గా లేదన్న కంప్లైంట్ రాగా…
ట్రైలర్ విషయంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని టీం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది… ఇక చాలా వరకు బాలీవుడ్ మూవీస్ టీసర్/ట్రైలర్/సాంగ్స్ కి యాడ్స్ లాంటివి వేస్తారు…కానీ వార్2 టీసర్ విషయంలో ఇలాంటివి ఏం చేయకపోవడం కూడా…
లో వ్యూస్ కి కారణం అవ్వడం కూడా కొంత ట్రోల్స్ కి కారణం అయ్యింది…ఇవన్నీ నోట్ చేసుకున్న టీం ఇక మీద సినిమా నుండి వచ్చే అప్ డేట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని అప్ డేట్స్ ఇస్తారని టాక్ ఉంది. ఇవన్నీ తట్టుకుని మంచి హైప్ తో పోటిలో వస్తున్నా కూలీని కూడా తట్టుకోవాలి…. మరి టీం రిలీజ్ టైంకి పోటిలో ఉన్న కూలీని మించి ఏ రేంజ్ లో సినిమా మీద హైప్ ను పెంచుతారో చూడాలి.