బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ సినిమా తెలుగు వర్షన్ తో పాటు తమిళ్ వర్షన్ ని ఒకేరోజున రిలీజ్ చేయగా తమిళ్ లో రిలీజ్ కి ముందర కొన్ని ఇబ్బందులు ఎదురు అయినా కానీ ఓవరాల్ గా రిలీజ్ రోజున సినిమా సజావుగా రాగా మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన వారియర్ మూవీ తమిళ్ లో….
కూడా మిక్సుడ్ టాక్ నే సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా అంతంతమాత్రమే వసూళ్ళని తమిళ్ లో సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా సినిమా తమిళ్ వర్షన్ కి గాను ఫస్ట్ వీక్ లో 2.8 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది, అక్కడ టాక్స్ ఎక్కువ ఉండటం వలన షేర్ తగ్గింది. మొత్తం మీద 4 కోట్ల బిజినెస్ కి 1.1 కోటి వరకే రికవరీ చేసిన సినిమా అక్కడ కూడా తీవ్రంగానే నిరాశ పరిచింది అని చెప్పాలి ఇప్పుడు.