Home న్యూస్ రంగస్థలం జపాన్ వీకెండ్ కలెక్షన్స్….టాప్ 3 తో మాస్ రచ్చ!!

రంగస్థలం జపాన్ వీకెండ్ కలెక్షన్స్….టాప్ 3 తో మాస్ రచ్చ!!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ రంగస్థలం(Rangasthalam) ఏ రేంజ్ లో రిలీజ్ అయినప్పుడు రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత రీసెంట్ గా సినిమాను…

జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ సినిమాకి పోటిగా కేజిఎఫ్ సిరీస్ కూడా రిలీజ్ అయినా కూడా RRR Movie లో నటించిన హీరో మూవీ అన్న ఫాక్టర్ బాగా కలిసి వచ్చి రంగస్థలం సినిమాకి అక్కడ ఆడియన్స్ నుండి మంచి ఆదరణ లభిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Rangasthalam Japan Box Office Collections
ఈ ఇయర్ ఇండియా నుండి అక్కడ రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద వీకెండ్ లో అక్కడ అప్ డేట్ అయిన కలెక్షన్స్ దృశ్యా 10 మిలియన్ జపాన్ యెన్స్ కి అటూ ఇటూగా…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 58 లక్షలకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా అక్కడ. ఇక అక్కడ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రాక్ అయిన సినిమాల పరంగా…..

RRR మూవీ, సాహో సినిమాల తర్వాత మూడో బిగ్గెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది రంగస్థలం సినిమా. కానీ సినిమా మరీ రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్ ఏమి చూపించడం లేదు కానీ ఉన్నంతలో మంచి జోరునే చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here