రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) ఎలాంటి ట్రోల్స్ ని నెగిటివిటీని రిలీజ్ అయిన తర్వాత సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ రేంజ్ లో ఎక్స్ ట్రీం ట్రోల్స్ ని టీసర్ రిలీజ్ టైంలో సొంతం చేసుకున్న ఆదిపురుష్ మూవీ…
రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అనుకున్నా కానీ మేకర్స్ తెలివిగా ట్రైలర్ కట్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ తో మళ్ళీ హైప్ ను పెంచడంతో మంచి పాజిటివ్ బజ్ ఏర్పడటంతో వీకెండ్ లోనే ఆదిపురుష్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా…
300 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న సినిమా తర్వాత మాత్రం ఎక్స్ ట్రీం ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమా తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రేంజ్ లో నెగిటివిటీని సొంతం చేసుకున్నా కూడా 350 కోట్లకు పైగా గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకున్న సినిమా…
పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుని, ఎలాంటి విమర్శలు లాంటివి లేకుండా ఉండి ఉంటేనా కచ్చితంగా ముందు అంచనా వేసినట్లు 1000 కోట్లకు తగ్గని గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఎంతైనా ఉండేది అని చెప్పాలి. అంతటి మంచి అవకాశాన్ని…
వృధా చేసుకున్న ఆదిపురుష్ సినిమా ఉన్నంతలో తీవ్రమైన ట్రోల్స్ తో కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది అని చెప్పాలి. కానీ రామాయణాన్ని జనాలకు నచ్చే విధంగా చూపించి ఉంటేనే కచ్చితంగా ఆదిపురుష్ మూవీ చరిత్రలో నిలిచిపోయే కలెక్షన్స్ ని అందుకునేది. కానీ అలాంటి అవకాశాన్ని సినిమా మిస్ చేసుకుంది.