మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా దసరా టైంలో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో రవితేజ కెరీర్ లో ఈ సినిమా బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.
కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో మేకర్స్ వెంటనే తేరుకుని సినిమా లెంత్ ని తగ్గించారు…. కానీ దసరా పోటిలో బిగ్ హైప్ ఉన్న లియో(LEO Movie) అలాగే సాలిడ్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న బాలయ్య(Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాల పోటి వలన…
టైగర్ నాగేశ్వరరావు ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది… అలాగే సినిమాలో వాయిలెన్స్ కొంచం ఎక్కువ ఉండటం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం అయ్యేలా చేసింది… ఓవరాల్ గా సినిమా లో రవితేజ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, మాస్ మూమెంట్స్ లాంటివి బాగానే ఉన్నా కూడా రిలీజ్ అయిన టైం తప్పని చెప్పొచ్చు.
సినిమాకి సోలో రిలీజ్ దక్కి ఉంటే బెటర్ రిజల్ట్ దక్కి ఉండేది అని చెప్పొచ్చు, సలార్(Salaar) పోస్ట్ పోన్ అయిన తర్వాత సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది, ఆ టైంకి రిలీజ్ చేసి ఉన్నా కూడా కచ్చితంగా సినిమా కి బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది….
కానీ ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సినిమా రీజనబుల్ కలెక్షన్స్ నే పోటిలో అందుకుంది, కానీ సోలో రిలీజ్ జరిగి ఉండి, అలాగే ఇప్పుడున్న లెంత్ నే ముందుగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి ఉంటే ఇప్పుడున్న సినిమా రిజల్ట్ కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ సినిమాకి దక్కి ఉండేది… ఓవరాల్ గా మాత్రం రవితేజ సినిమా మీద పెట్టుకున్న అంచనాలను పూర్తిగా సినిమా అందుకోలేక పోయింది అని చెప్పాలి…