Home న్యూస్ 5 సినిమాలలో ఫైనల్ విన్నర్ ఎవరు??

5 సినిమాలలో ఫైనల్ విన్నర్ ఎవరు??

0

      ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు టోటల్ గా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలే కానీ విచిత్రింగా అన్ని సినిమాలకు ఆల్ మోస్ట్ సేం రేంజ్ టాక్ రావడం విశేషం…ఏవి కూడా పెర్ఫెక్ట్ కాకపోవడం తో ఈ వీకెండ్ లో వచ్చిన సినిమాల్లో ఆడియన్స్ ఎ సినిమాలకు వేళ్ళలో అనేది వారి చాయిస్ కే వదిలేయాల్సి వస్తుంది…ఒకసారి ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో ఫైనల్ బెస్ట్ ఎదో తెలుసుకుందాం పదండీ.

   

ముందుగా అంతరిక్షం నుండి మొదలు పెడితే ఎక్స్ పెరి మెంటల్ మూవీస్, న్యూ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది, రెగ్యులర్ మూవీస్ చూసే వారికి మాత్రం ఈ సినిమా కొంత ఇబ్బంది పెట్టడం ఖాయమని చెప్పొచ్చు.

ఇక పడి పడి లేచే మనసు సినిమా లవర్స్ ని యూత్ ని ఆకట్టుకునే సినిమా నే అయినా అది కేవలం మొదటి అర్ధభాగానే సరిపోయింది…సెకెండ్ ఆఫ్ ఓపిక తో కూర్చుని చూసే వారికి ఈ సినిమా ఒక సారి చూడొచ్చు అని చెప్పాలి.

ఇక KGF సినిమా పక్కా మాస్ మసాలా మూవీ, మాస్ మూవీస్ ఇష్టపడే వారు, ఈ సినిమా కి వెళితే హీరోయిజం సీన్స్ తో విందు భోజనం దొరుకుతుంది. కానీ ఎంటర్ టైన్మెంట్ లేక పోవడం, సినిమాకి చిన్న మైనస్ పాయింట్ అని చెప్పాలి.

ఇక షారుఖ్ నటించిన జీరో అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమానే అయినా సెకెండ్ ఆఫ్ గాడి తప్పిన విధానం మాత్రం ఆకట్టుకోదు, ఆ లాంగ్ సెకెండ్ ఆఫ్ ని బరించే ఓపిక ఉన్న వాళ్ళు ఈ సినిమా ని ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కొంత వరకు ఈ సినిమా కి ఓటు వేసే చాన్స్ ఉంది.

ఇక ఫైనల్ గా వచ్చిన మారి 2 పెద్దగా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి అన్ని వర్గాలను ఆకట్టు కుంటుంది. యాక్షన్, కామెడీ, లవ్ స్టొరీ ఇలా అన్ని ఉన్న సినిమా ఉంది. కొన్ని బోర్ కొట్టే సీన్స్ ని బరిస్తే పక్కా పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు.

ఫైనల్ గా ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలో ఏది నికార్సయిన విన్నర్ అయితే కాదు…వేటికవే కొన్ని ప్లసులు కొన్ని మైనస్ లు కలిగి ఉన్నాయి…ఉన్నంతలో బెస్ట్ ఆప్షన్స్ గా అంతరిక్షం, KGF, మరియు మారి 2 సినిమాలు రేసులో ఉంటాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here