టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మెగాస్టార్ కి తిరుగు లేని కంబ్యాక్ సొంతం అయ్యేలా చేసింది. ఈ సినిమా విజయంతో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ కి ఊహకందని రేంజ్ లో ఆన్సర్ చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోలా శంకర్ సినిమాతో రాబోతున్నాడు చిరు…
కాగా ఈ సినిమా ముందుగా రిలీజ్ ను సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిపొయింది. కొత్త రిలీజ్ డేట్ ను టైం చూసుకుని మంచి రిలీజ్ డేట్ తో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు…
సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉన్నప్పటికీ రిలీజ్ కి ఇంకా టైం ఉన్నా కానీ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్స్ ఎవ్వరికీ అంతు పట్టడం లేదు, కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం లాస్ట్ ఇయర్ సమ్మర్ నుండి ఇప్పటి వరకు చిరు నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్యలు తక్కువ గ్యాప్ తోనే రిలీజ్ అవ్వడంతో….
మళ్ళీ తక్కువ గ్యాప్ తో భోలాశంకర్ ని రిలీజ్ చేయడం సబబు కాదని రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారని అంటూ ఉండగా, వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం వలన కూడా మరింత జాగ్రత్తలు తీసుకుని సినిమాలో ఫ్లాస్ ఏమైనా ఉన్నాయో చూసుకుని సరిచేసుకుని మరో హిట్ కొట్టాలని లేట్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఏది నిజమో తెలియదు కానీ ఈ సినిమాతో మరోసారి చిరుని వింటేజ్ మాస్ టచ్ ఉన్న రోల్ లో చూడటం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.