బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకు పోతున్న చిన్న సినిమా మేమ్ ఫేమస్… రిలీజ్ కి ముందు విపరీతమైన ప్రమోషన్స్ ని సొంతం చేసుకుని రిలీజ్ కి ముందు రోజు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అద్బుతంగా ఉందని కితాబు సొంతం చేసుకుని రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా…
నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి సైతం సినిమా అద్బుతంగా ఉందీ అని చెబుతూ ఉండటంతో ఆడియన్స్ నుండి మాత్రం ఇలా మిక్సుడ్ రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అని సినిమా టీం రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా ట్రోల్స్ పై పంచాయతీ పెట్టారు…
కొందరు కావాలని సినిమా పై ట్రోల్స్ చేసి సినిమాను తొక్కేయాలని చూస్తున్నారని కామెంట్ చేశారు… కానీ అలా చేయాలనీ ఎవరికీ ఉండదు కానీ సినిమా పై రిలీజ్ కన్నా ముందే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో విముఖత వచ్చింది, దానికి కారణం ఓవర్ ప్రమోషన్స్ అని చెప్పాలి. రీల్స్ రూపంలో టీం చేసిన ప్రచారం మొదట్లో పర్వాలేదు అనిపించినా అది రోజు రోజుకి ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉండటంతో…మంచి ప్రమోషన్స్ ఓ చిన్న సినిమాకి చేస్తున్నారు అన్న స్టేజ్ నుండి ఈ క్రింజ్ ప్రమోషన్స్ ఏంటి రా బాబు అని అనుకునేలా ఓవర్ ది టాప్ కి వెళ్ళింది.
దానికి తోడూ మహేష్ బాబు లాంటి హీరో సినిమా అద్బుతం అనడం, రిలీజ్ రోజున సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో మా హీరో పేరుని అనవసరంగా వాడారు అంటూ ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేశారు… మొత్తం మీద ఈ రెండే సినిమా కి ఒక రకంగా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కి ఒకరమైన కారణాలు అని చెప్పాలి..
కానీ ఓ చిన్న సినిమా కి రీసెంట్ టైం లో ఇలాంటి ప్రమోషన్స్ ని జరుపుకోవడం మాత్రం ఒక్క మేమ్ ఫేమస్ కే చెల్లింది… ఆ ప్రమోషన్స్ కి తగ్గట్లు సినిమాకి జాతిరత్నాలు, డిజే టిల్లు, బలగం లాంటి టాక్ అండ్ రివ్యూలు వచ్చి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ మరో విధంగా ఉండి ఉండేది కానీ ఇప్పటికీ మిక్సుడ్ రివ్యూలతో కూడా సినిమా రెవెన్యూ కొత్త నటీనటులను దృష్టిలో పెట్టుకుని చెప్పాలి అంటే చాలా బాగున్నాయనే చెప్పాలి.