Home గాసిప్స్ క్రిస్టమస్ కి రాకుండా…పుష్ప2 డిసెంబర్ 6నే ఎందుకు వస్తుందో తెలుసా??

క్రిస్టమస్ కి రాకుండా…పుష్ప2 డిసెంబర్ 6నే ఎందుకు వస్తుందో తెలుసా??

0

ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో ఎపిక్ క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ అయిన  పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సింది కానీ షూటింగ్ డిలే వలన ఇంకా 45 రోజులకు పైగా వర్కింగ్ డేస్ అవసరం ఉండటంతో…

ఇక అనుకున్న డేట్ కి రావడం కష్టం అవ్వడంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోగా ఏ డేట్ కి సినిమా వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ముందు పండగ వీకెండ్స్ ఏమైనా ఛాన్స్ దొరుకుందా అని ట్రై చేసినా కూడా సెకెండ్ ఆఫ్ డేట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. దాంతో డిసెంబర్ లో క్రిస్టమస్ డేట్ కి సినిమా రావొచ్చు అనుకున్నారు కానీ…

అందరినీ ఆశ్యర్య పరుస్తూ మేకర్స్ డిసెంబర్ లో క్రిస్టమస్ కి కాకుండా ఎలాంటి హాలిడేస్ లేని డిసెంబర్ 6 వీకెండ్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో క్రిస్టమస్ ని వదిలేసి ఇలా నార్మల్ డేట్ కి పుష్ప2 ఎందుకు వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి…

క్రిస్టమస్ వీకెండ్ అయితే ఇండియాలో కలెక్షన్స్ వస్తాయి కానీ 2 వారాల తర్వాత సంక్రాంతి మూవీస్ హడావుడి మొదలు అయ్యి అనుకున్న రేంజ్ లో లాంగ్ రన్ సొంతం అవ్వదు. అదే టైంలో హాలీవుడ్ లో క్రేజీ మూవీస్ ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉండటంతో ఓవర్సీస్ కలెక్షన్స్ పైన గట్టి ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది…

అదే డిసెంబర్ 6 అయితే నార్మల్ వీకెండ్ అయినా కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చిన యానిమల్ మూవీ లా టాక్ బాగుంటే లాంగ్ రన్ నెల మొత్తం సొంతం అయ్యే అవకాశం ఉంటుంది…తెలుగు హిందీ మేజర్ మార్కెట్స్ కాబట్టి నెల రోజుల లాంగ్ రన్ సొంతం అయితే వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉంటుంది…

సంక్రాంతి సినిమాల టైంకి రన్ కూడా సాఫీగా ఎండ్ అవుతుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నార్మల్ వీకెండ్ అవ్వడంతో ఓపెనింగ్స్ పై కొంచం ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ టాక్ బాగుంటే మట్టుకు క్రిస్టమస్ కి ఇక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా పుష్ప2 హంగామా అయితే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంటుంది….ఇక ఆ టైంకి సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here