ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీలలో చూసుకుంటే రీమేక్ లు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు, ఒరిజినల్ వర్షన్ లు ఆల్ రెడీ అందరికీ అందుబాటులో ఉండటం ఒక కారణం అయి ఉండొచ్చు, జనాలు రీమేక్ ల కన్నా ఒరిజినల్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేయడం ఒక కారణం అవ్వొచ్చు…
రీమేక్ సినిమాలను ముందు ఆదరించినట్లు ఆదరించడం లేదు, ఇలాంటి టైంలో టాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్ లు కొన్ని నిరాశ పరిచాయి. రీసెంట్ గానే వచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో మూవీ(BRO The Avatar) రీమేక్ అవ్వడం ఒరిజినల్ జనాలు చూసేయడం కూడా సినిమా రన్ పై ఎఫెక్ట్ చూపించింది.
ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన కొత్త సినిమా భోలాశంకర్(Bhola Shankar) కూడా తమిళ్ లో అజిత్ కుమార్(Ajith Kumar) హీరోగా చేసిన వేదాలం(Vedalam Remake) సినిమాకి రీమేక్ గా వస్తూ ఉండగా…
రీసెంట్ గా జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ ఎందుకు చేశారో ఆన్సర్ ఇచ్చారు… ఒక మంచి సినిమా మన ఆడియన్స్ కి అందించడానికి రీమేక్ చేస్తామని, ఇందులో కూడా ఒరిజినల్ వర్షన్ ఎక్కడా అందుబాటులో లేక పోవడం…
ఒరిజినల్ వర్షన్ గురించి చాలా తక్కువ మందికే తెలుసని నిర్మాతలు చెప్పడం, మేము కూడా అది ఎంక్వయిరీ చేసిన తర్వాతే రీమేక్ కి ఓకే చెప్పామని క్లారిటీ ఇచ్చారు… ఒరిజినల్ వర్షన్ తెలుగు లో డబ్ అవ్వలేదు కాబట్టి చాలా తక్కువ మందికే రీచ్ అయింది. అందుకే రీమేక్ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నామని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.