చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకుని హీరోగా మారి చేసిన మొదటి సినిమా తోనే ఆల్ మోస్ట్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన హీరో తరుణ్, ఫస్ట్ మూవీ నువ్వే కావాలి తోనే సంచలనాలను సృష్టించిన తరుణ్ తరువాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నిన్నే ఇష్టపడ్డాను, నువ్వే నువ్వే లాంటి సూపర్ హిట్స్ తో లవర్ బాయ్ గా తిరుగు లేని ఇమేజ్ ను టాలీవుడ్ లో సొంతం చేసుకున్నాడు…
కానీ తర్వాత సరైన సినిమాలను ఎంచుకోలేక పోయిన తరుణ్ ఒకటి తర్వాత ఒకటి సినిమాలు ఫ్లాఫ్ అవుతూ ఉండగా తనకి వచ్చిన ఇమేజ్ అండ్ మార్కెట్ కూడా తగ్గుతూ పోయి కంప్లీట్ గా మార్కెట్ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి టైం లో తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి…
కృష్ణవంశీ డైరెక్షన్ లో శశిరేఖ పరిణయం సినిమా తో తన వంతు ప్రయత్నం చేయగా సినిమా పర్వాలేదు అనిపించినా ఆశించిన సక్సెస్ ను ఇవ్వక పోవడం తో సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నాడు, ఆ టైం లో ఓ మంచి సినిమా అవకాశం తరుణ్ దగ్గరకి వచ్చింది.
అల్లరి నరేష్ హీరోగా వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో రూపొందిన “ఆహా నా పెళ్ళంట” సినిమా కథ తరుణ్ కోసమే రాసుకున్నారట, బాలీవుడ్ వెల్ కం సినిమా కథని పోలి ఉండే ఈ కథను తరుణ్ శశిరేఖ పరిణయం రిజల్ట్ వలన చేయలేదట, తర్వాత ఈ కథని అల్లరి నరేష్ దగ్గరకి తీసుకెళ్లడంతో అప్పుడు అల్లరి నరేష్ మంచి ఫామ్ లో ఉండటం తో సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ గా నిలిచింది, ఈ విషయాన్నీ డైరెక్టర్ రీసెంట్ గా తెలియజేశారు. ఒకవేళ తరుణ్ ఈ సినిమా ను ఒప్పుకుని ఉంటే నికార్సయిన కంబ్యాక్ కాకున్నా మంచి హిట్ తో కంబ్యాక్ చేసి ఉండే వాడు. కానీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం చూస్తున్న తరుణ్ త్వరలో కొత్త సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.