నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాన డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్, బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయ్యి ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ కి సాలిడ్ రేట్లు ఆఫర్ వచ్చినా నాని ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలి అంటూ గట్టిగా ఫిక్స్ అవ్వడం తో థియేటర్స్ లోనే…
రిలీజ్ కి సిద్ధం అవుతున్న టక్ జగదీష్ ఈ మధ్య ఈ నెల ఎండ్ కి థియేటర్స్ లో దిగడం కన్ఫాం అంటూ కొందరు థియేటర్ ఓనర్లు పేపర్స్ లో యాడ్స్ కూడా వేయించారు, కానీ మేకర్స్ మాత్రం అవన్నీ రూమర్స్ అంటూ మళ్ళీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చుకున్నారు.
కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మేకర్స్ కూడా జులై 30 నే సినిమాను థియేటర్స్ లో దింపాలని భావిస్తున్నారని కానీ దానికి బిగ్గెస్ట్ అడ్డంకిగా ఆంద్రప్రదేశ్ లో ఉన్న థియేటర్స్ టికెట్ రేట్లు అడ్డుగా నిలుస్తున్నాయని అంటున్నారు ఇప్పుడు… వకీల్ సాబ్ రిలీజ్ నుండి ఆంద్రలో…
టికెట్ రేట్లని ప్రభుత్వం కంప్లీట్ గా తగ్గించేసింది…. 150-200 ఉన్న రేట్లని కాస్త ఏకంగా 10,20,30,50 ఇలా ఓ 10 ఏళ్ల క్రితం నాటి రేట్లని థియేటర్స్ ఫాలో అవ్వాలని రూల్ పెట్టింది, ఇంతలో సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడం తో తగ్గాక పరిస్థితులు నార్మల్ అవుతాయి అనుకున్నా రీసెంట్ గా గుంటూరు, నెల్లూరు, వైజాగ్ లాంటి ఏరియాల్లో కొత్త టికెట్ రేట్లని అఫీషియల్ గా రిలీజ్ చేయగా AC థియేటర్స్ లో బాల్కనీ టికెట్ లు 100 పెట్టారు తప్పితే…
మిగిలిన అన్ని థియేటర్స్ లో టికెట్ రేట్లు 20-30-50 వరకే ఉన్నాయి… ఈ రేట్లతో ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేయడం అంటే థియేటర్స్ రెంట్స్ కూడా సరిపడా కలెక్షన్స్ రావని థియేటర్స్ మూసేశారు… అందుకే టక్ జగదీష్ సినిమా కూడా ఈ టికెట్ రేట్లు నార్మల్ అయితేనే రిలీజ్ ను అనౌన్స్ చేయాలనీ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి ఇక….