రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాల్సిన వకీల్ సాబ్ కి ఆంధ్రలో ఎదురుదెబ్బ తగులుతూనే ఉన్నాయి, ఏకంగా 6-7 ఏళ్ల క్రితం ఉన్న టికెట్ రేట్లని ఇప్పుడు అమలు పరచాలని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ ప్రభుత్వం చెప్పగా వకీల్ సాబ్ సినిమా కి మూడో రోజు నుండి నార్మల్ టికెట్ రేట్లు ఉండాలని హై కోర్టు కూడా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక మూడో రోజు నుండి ఈ నియమం పాటించని కొట్టి థియేటర్స్ లో బుకింగ్స్ కూడా ఆపించారు, ఇక విచిత్రంగా ఓల్డ్ మూవీ వైల్డ్ డాగ్ కి కొన్ని సెంటర్స్ లో కొత్త సినిమా వకీల్ సాబ్ కన్నా కూడా ఎక్కువ టికెట్ రేటు కనిపించడం జరుగుతుంది బుక్ మై షోలలో…
వైల్డ్ డాగ్ కి 150 టికెట్ రేటు ఉండగా వకీల్ సాబ్ కి మాత్రం ఇది వరకు 200 – 250 వరకు ఉన్న రేట్లు తగ్గించి 110 మాత్రమే ఉండేలా చేశారు. మరి అదే టైం లో ఓల్డ్ మూవీ వైల్డ్ డాగ్ కి కూడా టికెట్ రేట్లు తగ్గించాలి కదా అని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అందరూ…
ట్రోల్ చేస్తూ ఉండగా, వైల్డ్ డాగ్ కి పార్షిక టికెట్ హైక్స్ అగ్రిమెంట్స్ 2 వారల పాటు జరిగింది అని అంటున్నారు. అందువల్లనే ఇప్పుడు కూడా కొత్త సినిమా కన్నా వైల్డ్ డాగ్ కే ఎక్కువ రేటు ఉందని అంటున్నారు. కానీ టికెట్ హైక్స్ అన్నింటికీ తగ్గించాలి అని అంటే… కొత్త పాత అని తేడా లేకుండా తగ్గించాల్సి ఉంటుంది.
మళ్ళీ అందులో వకీల్ సాబ్ కి ఇంతలా తగ్గించడం ఏంటి అంటే మాత్రం ఎవ్వరి దగ్గరా సమాదానం లేదు. కానీ అన్ని సినిమాలకు కూడా సోమవారం నుండి కొత్త నిబంధనల మేరకు నార్మల్ రేట్లు ఉండి తీరుతాయి అని గట్టిగానే చెబుతున్నారు. ఇది పాలిటిక్స్ లో భాగమా లేక అన్ని సినిమాలకు ఇదే వర్తిస్తుందా అన్నది ఇక ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయితే అప్పుడు తెలుస్తుంది అని చెప్పొచ్చు.