బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ 2 గుడ్ ఫ్రై డే వీకెండ్ లో రెండు సినిమాలు పోటి పడ్డాయి, కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ కాగా మరోటి కార్తి నటించిన సుల్తాన్ సినిమా, ఒకటి ఎక్స్ పెరి మెంటల్ మూవీ మరోటి పక్కా కమర్షియల్ మూవీ. అయినా కానీ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వేటి రేంజ్ లో అవి ఓపెన్ అవ్వగా ఇద్దరు హీరోలు కూడా ప్రీవియస్ మూవీస్ ఫ్లాఫ్స్ కాబట్టి ఆ ఇంపాక్ట్ కొంచం…
ఓపెనింగ్స్ కలెక్షన్స్ విషయం లో కనిపించింది కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి రెండు సినిమాలు బాగానే పుంజుకున్నాయి. ముఖ్యంగా నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా మొదటి రెండు షోలు కూడా నార్మల్ గానే ఉన్నప్పటికీ టాక్ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవ్వడం తో…
ఈవినింగ్ షోలకు మంచి గ్రోత్ నే సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా పర్వాలేదు కానీ అన్ని చోట్లా అయితే అలా లేకపోవడం కొంచం ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపోచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఫస్ట్ డే ఈ సినిమా 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని…
ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ఇవి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఎటొచ్చి 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధిస్తే సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది అని చెప్పొచ్చు. మరి సినిమా ఆ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక కొన్ని మాస్ సెంటర్స్ లో వైల్డ్ డాగ్ కన్నా కూడా సుల్తాన్ సినిమా బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది.
కమర్షియల్ మూవీ అండ్ రష్మిక కూడా ఉండటం తో సినిమా కి కొన్ని చోట్ల బెటర్ ఓపెనింగ్స్ లభించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ కూడా బాగుంది, దాంతో ఫస్ట్ డే సినిమా 80 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క 1 కోటి వరకు వెళ్ళే అవకాశం మించే అవకాశం కూడా ఉంది, మరి రెండు సినిమాలు అంచనాలను మించుతాయా లేక ఇదే రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తాయో చూడాలి.