బాక్స్ ఆఫీస్ దగ్గర సడెన్ గా మునుపటిలా కలెక్షన్స్ రావడం లేదు, బహుశా జనాలు అందరూ వకీల్ సాబ్ కోసం ఎదురు చూస్తున్నారేమో లేక ఆ సినిమా కోసం డబ్బులు సేఫ్ చేసుకుంటున్నారు కావొచ్చు, లేదా కేసులు పెరుగుతూ వెళుతూ ఉండటం తో కొత్త సినిమాలను పట్టించుకోవడం లేదేమో కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం కొత్త సినిమాల పై గట్టిగా కనిపిస్తుంది ఇప్పుడు. లాస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు పోటి పడగా…
రెండు సినిమాలు ఇప్పుడు మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్నాయి. సినిమాల వర్కింగ్ డేస్ కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోవడం విచారకరం. 5 రోజుల్లో వైల్డ్ డాగ్ 3.24 కోట్ల షేర్ ని సాధిస్తే… సుల్తాన్ సినిమా 3.13 కోట్ల షేర్ ని సాధించింది. 6 వ రోజు వైల్డ్ డాగ్ మూవీ 8 లక్షల…
షేర్ ని అందుకుంటే సుల్తాన్ సినిమా 12 లక్షల షేర్ ని సాధించింది. ఇక 7 వ రోజు వైల్డ్ డాగ్ మూవీ 4 లక్షల షేర్ ని సాధిస్తే సుల్తాన్ మూవీ 8 లక్షల షేర్ ని సాధించింది. దాంతో మొత్తం మీద మొదటి వారంలో వైల్డ్ డాగ్ తెలుగు రాష్ట్రాలలో 2.97 కోట్ల షేర్ ని అందుకోగా…
వరల్డ్ వైడ్ గా 3.4 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకుంది, ఇక సుల్తాన్ సినిమా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 3.33 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. వైల్డ్ డాగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.4 కోట్లు కాగా ఫస్ట్ వీక్ తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 6 కోట్ల షేర్ ని ఇంకా సాధించాల్సి ఉంటుంది.
ఇక సుల్తాన్ సినిమా బ్రేక్ ఈవెన్ 6.5 కోట్లు కాగా ఇంకా 3.17 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేకే ఈవెన్ ని అందుకోలేవు, వైల్డ్ డాగ్ డబుల్ డిసాస్టర్ కాబోతుండగా సుల్తాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా పరుగును ముగించడం ఖాయంగా కనిపిస్తుంది.