బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ మొదటి వీకెండ్ లోనే వరుస పెట్టి మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి, మూడు సినిమాలు కూడా డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కిన సినిమా లే అవ్వ గా మూడు సినిమాలు వేటి రేంజ్ లో అవి బిజినెస్ లు కూడా చేసాయి, ఇక మూడు సినిమాల రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ కౌంట్ వివరాలు కూడా బయటికి వచ్చాయి. ఒకసారి ఆ వివరాలను గమనిస్తే…
ముందుగా ఏప్రిల్ 1 న రిలీజ్ అవుతున్న కన్నడ డబ్ మూవీ యువరత్న సినిమా ముందుగా బిజినెస్ లో కొన్ని మార్పులు జరిగాయి, సినిమా కొన్ని సెంటర్స్ లో ఓన్ రిలీజ్ కానుండగా అవి తీసేస్తే మొత్తం మీద బిజినెస్ 60 లక్షల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి 80-85 లక్షల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇక సినిమా నైజాం ఏరియాలో 47 థియేటర్స్ లో టోటల్ తెలుగు రాష్ట్రాలలో 145 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. టోటల్ స్క్రీన్ కౌంట్ సుమారు 220 వరకు ఉంటుందని అంచనా… ఇక కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్…
నైజాం ఏరియాలో 216 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సుమారు 580 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. సినిమా జానర్ కి ఇది సెన్సేషనల్ థియేటర్స్ కౌంట్ గా చెప్పుకోవచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక పోటి లో కమర్షియల్ మూవీ అయిన…
కార్తీ నటించిన సుల్తాన్ సినిమా నైజాం ఏరియాలో 190 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 460 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.5 కోట్లు… మూడు సినిమాలు కలిపి టోటల్ గా 1185 థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కానున్నాయి. మరి ఏ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.